రాత్రి 8:00 దాటితే అలాంటి పనులు అస్సలు చేయను.. తమన్నా వింత కండిషన్స్ మామూలుగా లేవుగా..?!

టాలీవుడ్ మిల్కీ బ్యూట్టి తమన్నకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో వ‌రుస ఆఫర్లను అందుకుంటు నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఏజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతకంతకు పెంచుకుంటుంది. అయితే బాహుబలి లాంటి పాన్‌ ఇండియా సినిమాలో నటించిన తర్వాత మరింత క్రేజ్ పెరుగుతుందని అంత భావించారు. కానీ తమన్నాకు ఆ సినిమా తర్వాత కాస్త డౌన్ ఫాల్ ఎదురయింది. తప్ప సక్సెస్ రేట్ కనిపించడం లేదు. ఆ సినిమా తర్వాత ఈమెకు ఇప్పటివరకు మంచి కమర్షియల్ హిట్ పడలేదు అనడంలో సందేహం లేదు.

Actress Tamannaah Bhatia New Photos @ Queen Telugu Movie Launch |  Moviegalleri.net

ఒక పక్కన స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే.. మరో పక్క యంగ్ హీరోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన అందం, అభినయంతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా త‌మ‌న్న‌ నుంచి రిలీజ్ అయిన తమిళ్ మూవీ అరుణ్‌మనై 4.. హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక సినిమాలు వెబ్ సిరీస్‌లే కాకుండా ఐటమ్ సాంగ్ లోను అదరగొడుతుంది మిల్కీ బ్యూటీ. ఈ క్ర‌మంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తమన్న.. తన గురించి కొన్ని ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది.

Tamannaah Bhatia shares a video tracing her acting journey as she completes  18 years 18 : Bollywood News - Bollywood Hungama

ఆమెకు ఉన్న వింత అలవాటు గురించి మాట్లాడుతూ.. ఎప్పుడైనా, దేనికైనా సిద్ధంగా ఉంటానని అందరికీ చెప్తా. కానీ అది నిజం కాదు. నాకు రాత్రి 8 గంటలు దాటితే ఎక్కడికి వెళ్ళాల‌న్నా లేదా ఏదైనా పని చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. రాత్రి 8 తర్వాత పనులు చేయడం మంచిది కాదు అంటూ తమన్న తనకున్న షాకింగ్ అలవాటును రివీల్ చేసింది. దీనితో ఆమె ఫ్యాన్స్ డే మొత్తం షూటింగ్, వర్కౌట్స్ తో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎనిమిది దాటాక అయినా రెస్ట్ తీసుకోవాలిగా మరి అంటూ.. ఏదైనా త‌మ‌న్న‌ కండిషన్ జూప‌ర్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.