ఆ విషయంలో చరణ్, నేను ఎక్కువగా బాధపడతాం.. ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.. ఉపాసన షాకింగ్ కామెంట్స్..?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండ‌ప్ట్రీతో ఎటువంటి సంబంధం లేకపోయినా.. తను చేసే మంచి పనులతో మెగా ఫ్యామిలీ కోడలిగా భారీ పాపులారిటి దక్కించుకుంది ఉపాసన. ఇక రాంచరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్, ఆర్ సి 16 సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక సినిమాలతో సహా ఫ్యామిలీ లైఫ్ కు ప్రాధాన్యతను ఇచ్చే చెర్రీ.. టైం కుదిరినప్పుడల్లా కూతురు, భార్యతో కలిసి వెకేషన్లను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

Ram Charan's wife Upasana shares photo with newborn: 'Overwhelmed by the  warm welcome for our little one' | Mint

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఉపాసన.. చెర్రీ గురించి క్లింకార గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఉపాసన పెళ్లయిన దాదాపు 11 ఏళ్లకు క్లింకారకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే క్లీంకార పుట్టిన తర్వాత ఉపాసన డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. అప్పుడు చరణే తనకు థెరఫిస్ట్‌లా పనిచేశాడని.. నేను డిప్రెషన్ లోకి వెళ్లిన సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదని వివ‌రించింది.

Inside Ram Charan And Upasana Kamineni's Daughter Klin's First Beach Visit  - News18

దీంతో కొంతకాలం అమ్మ దగ్గర ఉండాలనిపించింది.. దీనికి చరణ్‌ ఒప్పుకోవడమే కాదు నాతో పాటు మా పుట్టింటికి తను కూడా వచ్చేసి.. పక్కనే ఉండి ధైర్యం చెప్పాడని ఆమె వివరించింది. ఇక మాకు ఉన్న బిజీ స్కెడ్యూల్, వర్క్స్ కారణంగా ఒక్కోసారి పాపను ఇంట్లో వదిలేయాల్సి వచ్చేదని.. ఆ టైంలో పాప కంటే మేమే ఎక్కువగా బాధపడేవాళ్ళం.. తనకోసం ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ వివరించింది ఉపాసన. ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.