అస్సలు హీరోయిన్ లేకున్నా హిట్ అయి ఉండే సినిమాల లిస్ట్ ఇదే..?!

ఓ సినిమా సక్సెస్ అయిందంటే హీరో తో పాటు హీరోయిన్ మిగతా క్యారెక్టర్లకు కూడా కాస్త ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ప్రతి సినిమాకి అందరూ ఉండాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు సినిమాలో హీరోయిన్ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది అనిపించే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఒకటి లేదా రెండు క్యారెక్టర్లతో సినిమా మొత్తం రన్ చేసిన సినిమాలు కూడా ఉంటాయి. ఇక టాలీవుడ్ అనగానే ఆరు పాటలు మూడు ఫైట్స్ ప్రతి సినిమాలో కచ్చితంగా ఉంటాయి. దానికి తోడు కామెడీ, మాస్, యాక్షన్ అంటూ మిగతావి కూడా అవసరం ఉన్నా లేకపోయినా జోడించేసి మరి సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Vakeel Saab

సినిమాలో ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోతే ప్రేక్షకులు ఒప్పుకోరు అని ఆలోచనలో మేకర్స్, హీరోలు కూడా ఉంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్ అవసరం లేకుండా బలవంతంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అలా అవసరం లేకుండా హీరోయిన్ పెట్టి తెర‌కెక్కించిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగ వ‌చ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వకీల్ సాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈ సినిమా పూర్తిగా ముగ్గురు ఆడపిల్లల జీవితంలో ఓ రాత్రి జరిగిన సంఘటన ఆధారంగా తెర‌కెక్కింది. కేసు, కోర్టు అంటూ ఈ సినిమా మొత్తం సాగుతుంది. ఈ సినిమాలో వకీల్ సాబ్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించగా హీరోయిన్ అవసరం లేకున్నా ఏదో పెట్టాలి అన్నట్టుగా శృతిహాసన్ పెట్టారు.

Veera Simha Reddy Second Single Suguna Sundari Announced | cinejosh.com

అలాగే సరిలేరు నీకెవరు సినిమాల్లో రష్మిక మందన పాత్రకు అసలు ఇంపార్టెన్స్ లేదు. ఈ సినిమాకు ఆమె పాత్ర లేకున్నా అసలు ఇబ్బంది లేదు. అయినప్పటికీ సినిమాలో రొమాన్స్, సాంగ్స్ ఉండాలి కనుక రష్మిక పాత్రను ఇన్వాల్వ్ చేసి సినిమాను తెరకెక్కించారు. ఇక మహేష్ హీరోగా బ‌చ్చిన‌ స్పైడర్ సినిమాలోని రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర వల్ల ఉపయోగం ఏమిటో కూడా అర్థం లేదు. ఆమెను ఉంచారు కాబట్టి ఒకటి రెండు సీన్ తెరకెక్కించి డ్యూయెట్ పుట్టారు డైరెక్టర్. ఇక బాలకృష్ణ హీరోగా వ‌చ్చిన‌ వీర సింహారెడ్డి సినిమాలో కూడా శృతిహాసన్ అవసరం లేకుండా ఆమె పాత్రను ఇన్వాల్వ్ చేశారు. ఇంకా ఆమె లేకుండానే సినిమా బాగుండేది అంటూ పలు కామెంట్స్ కూడా వినిపించాయి.