ఎన్నికల్లో మొదలైన మరో లొల్లి.. ఈ కలర్ లు గోల ఏంట్రా బాబు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే.. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే బడా బడా స్టార్ ప్రముఖులు అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . ఈరోజు ఉదయం ఏడు గంటలకే జూనియర్ ఎన్టీఆర్ తన భార్య తల్లితో కలిసి హైదరాబాద్లోని ఓబుల్ రెడ్డి హైస్కూల్లో పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి.

అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది . తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ పోలింగ్ బూత్ వద్దకి బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వచ్చాడు . బ్లూ కలర్ ఏ పార్టీకి చిహ్నం మనకు తెలిసిందే .. అయితే ఇప్పుడు బ్లూ కలర్ షర్ట్ వేసుకోవడం రావడం వల్ల తారక్ టిడిపికి కాకుండా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అన్న ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు రీసెంట్ గానే సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలను ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో చూసాం.

ఈ మధ్యకాలంలో చంద్రబాబును కలిసే సమయంలో ఎల్లో రెడ్ బోర్డర్ శారీ తో దర్శనమిచ్చింది . దీంతో అప్పుడు షర్మిల ను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు జనాలు. టిడిపి జనసేనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టే అలాంటి కలర్స్ ఉన్న శారీ ని కట్టుకునింది అని .. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు . కాబట్టే బ్లూ కలర్ షర్ట్ ధరించాడు అని ప్రచారం చేస్తున్నారు.. మరికొందరు వాళ్లేదో వేసుకుంటే మీకేంటి రా నొప్పి అంటూ ఘాటుగా సమాధానం ఇస్తున్నారు . మొత్తానికి ఈ కలర్స్ గోల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!