శ్రీముఖి పెళ్లి ఈ ఏడాదే.. ముక్కు అవినాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

నటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. యాంకర్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. పటాస్ లాంటి ప్రోగ్రాంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తరువాత అదే క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన ఆటతీరుతో.. క్యారెక్టర్ తో.. ప్రేక్షకులను మెప్పించిన శ్రీముఖి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరోపక్క హీరోయిన్గా అవకాశాలను అందుకుంటుంది. ఇక పలుషోల‌కి కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్న శ్రీముఖి.. ప్రస్తుతం నాలుగైదు షోస్ చేస్తూ బిజీగా గడుపుతుంది.

Mukku Avinash | The world got a little bit better on this day because my best friend was born! Happy birthday my dear friend 😘🥰🎂💐 @sreemukhi ... | Instagram

ఆ ఛానల్ ఈ ఛాన‌ల్‌ అని తేడా లేకుండా ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు, జెమిని ఇలా అన్ని ఛానల్స్ లోను హోస్ట్‌గా వ్యవహరిస్తూ దూసుకుపోతుంది. ఈమెకు మూడు పదుల వయసు దాటుతున్న ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి ఎప్పుడు.. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న పదేపదే ఎదురవుతూనే ఉంటుంది. అయితే పెళ్లి గురించి జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ రీసెంట్గా చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీముఖి.. పెళ్లి గురించి మాట్లాడుతూ ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతానికి శ్రీముఖి కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని వివ‌రించాడు.

ఒక మంచి ఛాన్స్ రావడానికి ఏడేళ్లు పట్టింది: ముక్కు అవినాష్

మొన్నటి వరకు ఆమె చేసుకోన‌ని అంటుంది.. నువ్వైనా పెళ్లి చేసుకోమని చెప్పమని అడిగే వారిని.. ఇప్పుడు అదేమీ లేకుండా సంబంధాలు చూస్తున్నారని.. అన్ని బాగుంటే ఈ ఏడాది శ్రీముఖి పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు. సంబంధాలు చూస్తుంటే శ్రీముఖి కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుందని.. నచ్చిన కుర్రాడు దొరికితే ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందంటూ వివరించాడు. ప్రస్తుతం అవినాష్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.