పాలిటిక్స్ పై అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్..ముఖం మీదే చెప్పేశాడుగా..!

మనకు తెలిసిందే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరుని జనాలు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో.. దానికి కారణం కూడా మనకి బాగా తెలుసు . తన మామయ్య పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేసి జనసేన పార్టీ తరపున ప్రచారానికి రాకుండా నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించడం అందరి అభిమానులకి మండిపోయేలా చేసింది . మెగా అభిమానులకి మరీ మరీ కాలేలా చేసింది . జనసేన కోసం కేవలం ట్వీట్ మాత్రమే చేశావు . నీ ఫ్రెండ్ కోసం మాత్రం ఏకంగా నంద్యాలకు వెళ్లి ప్రచారం చేశావు ఇది ఎంతవరకు న్యాయం అంటూ మెగా ఫాన్స్ మండిపడ్డారు.

ట్రోలింగ్ కూడా చేశారు . అయితే తాజాగా దానికి క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు . ఈ క్రమంలోనే ఓటు అందరూ వేయాలి అని ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు . అంతేకాదు ఈ క్రమంలోనే నంద్యాల టూర్ పై అల్లు అర్జున్ మాట్లాడుతూ..” నా సపోర్ట్ ఎప్పుడూ కూడా మావయ్య పవన్ కళ్యాణ్ కి శిల్ప నా ఫ్రెండ్ అందుకే నేను ఆయనకు సపోర్ట్ చేశాను ..గతంలో ఆయనకు మాటిచ్చాను ఆ మాట తప్పకూడదు అని ప్రచారానికి వెళ్లాను “..

“నా సపోర్ట్ ఎప్పుడూ కూడా మా మామయ్యకి నేను ఏ పార్టీకి బానిసను కాదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు” అల్లు అర్జున్. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఒక్క ముక్కలో నాకు పాలిటిక్స్ కి ఎటువంటి సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పేశాడు అల్లు అర్జున్. దీంతో ఇదే న్యూస్ వైరల్ గా మారింది.