ఓటు వేయడానికి పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఎన్టీఆర్ చేసిన పనికి జనాలు షాక్..ఏం చేశాడో చూడండి..!

సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ అంటే హై సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా సరే బాడీగార్డ్స్ తమ వెనకే ఉంటారు . అయితే కొందరు స్టార్స్ మాత్రం అలాంటి పనులను చేయడానికి ఇష్టపడరు . కాగా తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది . నేడు తెలంగాణలో 17వ లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి .

ఈ క్రమంలోనే పలువురు స్టార్ సెలబ్రిటీస్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు హీరోలు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉదయం ఏడు గంటలకే జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు తన భార్య లక్ష్మీ ప్రణతి అదే విధంగా తల్లి శాలిని కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు .

అయితే పాన్ ఇండియా రేంజ్ లో స్టేటస్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ చాలా సింపుల్ గా చాలా సాదాసీదాగా ఒక సామాన్యుడిలా ఒక కామన్ పీపుల్లా క్యూ లైన్ లో నిల్చోని ఓటు వేయడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది . దాదాపు 20 నిమిషాల పాటు తారక్ క్యూలో నిల్చోని ఓటు వేశారు . దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . చిరంజీవి – అల్లు అర్జున్ మిగతా స్టార్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..!!