తెలంగాణలో ముగిసిన కీలక ఘట్టం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామిషనేషన్‌ల గడువు ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి 119 మంది నామినేషన్లు వేయగా… కాంగ్రెస్‌ నుంచి 118 మంది, బీజేపీ నుంచి 111 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 16, జనసేన 8, బీఎస్సీ 88, ఎంఐఎం 9 స్థానాలలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా కేసీఆర్‌, రేవంత్ రెడ్డి, ఈటల […]

కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా….!

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.., దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. సిద్దిపేట జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సీఎం కేసీఆర్ కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం. ఏ ముఖ్యమైన కార్యం తలపెట్టినా ఇక్కడి […]

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ…?

పోలింగ్ చివరి వారం కాంగ్రెస్ కి కలిసి రానుందా? ఆ ఏడు రోజులు కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో ఉండనున్నారా? ఆపరేషన్ తెలంగాణ పేరుతో సునీల్ కనుగోలు కొత్త అస్త్రాన్ని వదలనున్నరా? పరిస్థితి చూస్తుంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో తామే గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు హస్తం నేతలు. మరో వైపు కాంగ్రెస్ […]

కేసీఆర్ వర్సెస్ ఈటలగా మారిన వైనం

గజ్వేల్ లో ఆసక్తికర పోటీకి తెర లేచింది.. ఈటల ఎంట్రీతో వార్ వన్ సైడ్ కాదని తేలిపోయింది.. కేసీఆర్ కు షాక్ ఇచ్చే రీతిలో ఈటల గజ్వేల్‌లో ఎంట్రీ ఇచ్చారు. బీఅర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ మంత్రంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటే….ఈటల మాత్రం అధికార పార్టీ లోపాలు.. సెంటిమెంట్ అస్త్రం, బీసీ మంత్రంతో కాకపుట్టిస్తున్నారు. దీంతో గజ్వేల్ లో ఆసక్తికరమైన పోటీ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపు అంతా… ఇప్పుడు గజ్వేల్ వైపే ఉంది. అధికార బీఅర్ఎస్ […]

టీ కాంగ్రెస్‌కు రాహుల్ పర్యటన లాభమా… నష్టమా…?

రాహుల్ గాంధీ బస్సు యాత్ర… టీ కాంగ్రెస్‌కు మంచి బూస్టప్‌ ఇచ్చిందా? గులాబీ కంచుకోటను బ‌ద్దలు కొట్టే శ‌క్తి హ‌స్తానికి ఉందా? ఎన్నిక‌ల ఎజెండాను సెట్ చేయ‌డంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్న హస్తం నేతల మాటలు అక్కడ ఓట్లు రాలుస్తాయా? ఇంతకి బ‌స్సు యాత్ర లక్ష్యం నెరవేరిందా? రాహుల్ బస్సు యాత్ర… తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెంచిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మూడు రోజులపాటు కొనసాగిన రాహుల్ టూర్ కాంగ్రెస్ ఇమేజ్‌ను మ‌రింత‌ పెంచిందని రాజకీయ […]

మేమేం చేయాలో మీరే చెబితే ఎలా… రేవంత్ ఫైర్….!

తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నవంబర్ 30వ తేదీన ఒకే విడతలో మొత్తం 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు రోజులకు డిసెంబర్ 3న కౌటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినప్పటికీ… బీ ఫామ్ ఇచ్చే వరకు టికెట్ తమకే వస్తుందో రాదో అని బీఆర్ఎస్ నేతలు […]

తెలంగాణలో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలో అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించనుంది. తొలివిడతలో 50 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. అటు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై.. స్క్రీనింగ్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కచ్చితంగా గెలిచే వారికే కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇవ్వనుంది. అటు.. టికెట్లు […]

కేంద్రం ముందస్తు దిశగా అడుగులు వేస్తుందా…!?

ముందస్తు ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నలుగురు గుమిగూడిన ఇదే చర్చ. అయితే నిజంగానే ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్‌ ఉందా..? అనేది డౌట్. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు.. కేంద్రం ఇస్తున్న సిగ్నల్స్‌ చూస్తుంటే ముందస్తుకు కేంద్రం సిద్దమవుతోందనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది. పార్లమెంట్‌ అత్యవసర సమావేశాలు పెట్టడం.. జమిలీ ఎన్నికల ప్రక్రియను మొదలు పెడుతూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీ వేయడం వంటివి జరుగుతున్నాయి. […]

కాక రేపుతున్న తెలంగాణ పాలిట్రిక్స్…!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒకేరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ప్రధానమంత్రి మోదీ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. […]