ఎలక్షన్స్ లో ప్రభాస్ ఓటు వేయకపోవడానికి కారణం అదేనా.. పాపం ఎంత కష్టం వచ్చిందో..?

హమ్మయ్య ..ఎట్టకేలకు ఏపీ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది . ఇన్నాళ్లు రాజకీయ నాయకుల మధ్య మాటలు తూటాలు లా పేలాయి. మేము ఇది అంటే మీరు ఇది అంటూ ఓ రేంజ్ లో కుమ్మేసుకున్నారు . మాటలతోనే పోట్లాడే స్థాయికి కూడా వెళ్ళిపోయారు . ఎన్ని తిట్టుకున్న ఎన్ని మాట్లాడుకున్న ఫైనల్లీ గెలిచేది ఒకరే . సీఎం పదవి చేపట్టేది ఒకరే. అది అందరికీ తెలిసిందే. ఫైనల్లీ ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో పలు రాజకీయ నేతలు ఫుల్ గా రిలాక్స్ అవుతున్నారు . ఎలక్షన్స్ కౌంటింగ్ డేట్ వరకు చిల్ అవుట్ అవ్వడానికి కొందరు విదేశాలకి మరికొందరు తమ సొంత ఊర్లకి పయణమయ్యారు. కాగా ఇదే క్రమంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్నారు . దానికి కారణం ఆయన ఎలక్షన్స్ లో ఓటు వేయకపోవడం .

అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . పెద్ద పెద్ద స్టార్ హీరోలు వయసు అయిపోయిన హీరోలు కూడా వచ్చి పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలుచోని మరి ఓట్లు వేశారు. ఆరోగ్యం బాగో లేకపోయినా సరే కోటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రభాస్ మాత్రమే ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోలేక పోయాడా ..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రభాస్ ఓటు వేయలేదు . బహుశా ఏపీలో ఓటు ఉంది కాబోలు అందుకే ఇక్కడ వేయలేదు అనుకున్నారు జనాలు .

అయితే ఏపీలో కూడా ఓటు వేయలేదు . దీంతో ప్రభాస్ కి అసలు బాధ్యత లేదు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఇండియాలోనే లేడు విదేశాలలో ఉన్నాడు. ఆ కారణం చేతనే ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాడట . ప్రభాస్ ఆరోగ్యం కూడా బాగోలేదట . పలు సర్జరీ చేయించుకున్న మోకాలి గాయం మళ్ళీ తిరగబడిందట . అంతేకాదు ఆయన హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగానే విదేశాలకు వెళ్ళాడు అని అక్కడ కొన్ని సినిమా షూటింగ్స్ నిమిత్తం అక్కడే ఉండిపోయారు అని ..ఆ తర్వాత డాక్టర్ ల అపాయింట్మెంట్ ఉండటంతో ఇండియాకి తిరిగి రాలేక ఆయన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది..!!