బాలయ్య ..చాలా మొండోడు ..ఈ విషయం అందరికీ తెలిసిందే. తాను అనుకున్న పని చేసి తీరుతాడు.. అది కూడా అందరికీ తెలుసు . బాలయ్యను టచ్ చేయడానికి ఎవ్వరూ కూడా సాహసం చేయరు. అది రాజకీయాలు అయినా సినిమా ఇండస్ట్రీ అయినా ..ఎవరైనా సరే మరొకసారి దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ..ఏపీలో ఎన్నికల్లో ప్రశాంతంగా జరిగాయి . పోలింగ్ కూడా అక్కడక్కడ మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా జరిగాయి. కాగా ఎలక్షన్స్ రూల్ ప్రకారం పోలింగ్ జరుగుతున్న 100 మీటర్ల పరిధిలో ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఏ రాజకీయ నాయకుడు గాని .. ఎవ్వరూ కానీ పార్టీ జెండాలు అదేవిధంగా సింబల్స్ ఉంచకూడదు .
అంతేకాదు డ్రెస్ కోడ్ కూడా కంపల్సరీ .. పలు పార్టీలకు సంబంధించిన కండువాలు ఉన్న డ్రెస్సెస్ వేసుకోకూడదు.. లోగోలు కూడా పెట్టుకోకూడదు . అయితే పిఠాపురంలో ఓ జనసేన కార్యకర్త ఏకంగా పోలింగ్ బూత్ వద్దకి జనసేన పార్టీని రిఫర్ చేస్తూ మెడలో తువాల్ వేసుకుని వచ్చారు . అయితే వెంటనే అక్కడున్న వాళ్ళు అడ్డుకున్నారు . కాగా ఇదే సిచువేషన్ మనకి బాలయ్య విషయంలోనూ జరిగింది . నందమూరి నట సిం హం బాలయ్య హిందూపూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేయడం కోసం బాలకృష్ణ క్యూలో నిలబడ్డారు. అయితే పసుపు కండువా మెడలో కప్పుకొని బాలకృష్ణ ఓటు వేయడం గమనార్హం . ఇది ఎవ్వరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అభ్యంతరం వ్యక్తం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ వీడియోని బాలయ్య బాబు అభిమానులు స్వయంగా ట్రెండ్ చేస్తున్నారు. దట్ ఈజ్ బాలయ్య .. మా బాలయ్య బాబుని ఎవరు టచ్ చేయడానికి కూడా సాహసం చేయరు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!
Ey Universe nunchi vachav ayya.. Balayya 🤣🤣😭💥💥💥🥵🥵🥵🔥🔥🔥#TDPWinningBigggggg 🎉🥳pic.twitter.com/zXbjDH8cQb
— Bhargav 🚲💛✊ (@bhargavraam8) May 13, 2024