ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. తాజాగా అడ్వాన్స్ బుకింగ్ ఒపెన్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెనై భారీ బిజినెస్ జరిగింది. దీంతో ఇండియాలో ఎప్పుడెప్పుడు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతాయా అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ సినీ లవర్స్ కూడా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారి ఎదురు చూపుకు తెర దించుతూ .. మేకర్స్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు.
తాజాగా తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమై క్షణాల్లోనే బీభత్సం సృష్టించాయి. ఏసి ప్రభుత్వం నేడు కల్కి టికెట్ల రేట్లు భారీ పెంపుకు అనుమతి ఇవ్వగా.. వెంటనే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన మేకర్స్ తెలంగాణలో కాస్త ఆలస్యంగా బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ఇలా టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేసిన గంట వ్యవధిలోనే 59 నుంచి 60 వేల వరకు టికెట్లు అమ్ముడుపోయి సంచలనం సృష్టించాయి.
అప్పుడే థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ లో హౌస్ ఫుల్ చూపిస్తున్నాయంటే కల్కి మూవీపై ప్రేశ్రీకులలో ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అడ్వాన్స్ బుకింగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే కల్కి ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్ ఇవ్వడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ లో ఇప్పటివరకు ఉన్న ఆర్ఆర్ఆర్, సలార్ లాంటి భారీ సినిమాల రికార్డును ప్రభాస్.. కల్కితో బ్రేక్ చేస్తాడని సినీ ప్రముఖులు అంచనాలు వేస్తున్నారు.