తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె.. మెగా ప్రిన్స్ క్లింకార.. మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్సెస్‌కు శుభాకాంక్షలు వెలువెత్తాయి. చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు చాలామంది అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా క్లీన్ కారకు పుట్టినరోజు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలో ఉపసన సోషల్ వేదికగా ఎమోషనల్ వీడియోను షేర్ చేస్తూ తన ముద్దుల కూతురి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
క్లింకార రాకతో తమ జీవితాలు ఫుల్‌ఫిల్ అయ్యయంటూ పేర్కొన్న ఉపాసన.. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ సార్లు చూసి ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. తమ జీవితాల్లో ఆనందం నింపినందుకు క్లింకారకు ధన్యవాదాలు తెలియజేసింది ఉపాసన. ఈ వీడియో పై మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సహా పలువురు కుటుంబ సభ్యులంతా స్పందిస్తూ తమదైన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. క్లీన్‌కార తన కుటుంబంలోకి రావడానికి ముందు ఆమె గురించి అంతా ఎంతగానో ఎదురు చూసామని.. ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కూడా వివరించారు.
ఈ వీడియోలో చెర్రీ ఉపాసన పెళ్లి, క్లింకార నామకరణ వేడుక సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో అభిమానులు క్లింకార ఫేస్ రివిల్ అయిన ఓ లేటెస్ట్ ఫోటోను తెగ షేర్ చేస్తు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో క్లింకారను ఉపాసన ఎత్తుకొన్ని ఉన్న ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది మీరు ఓ లుక్ వేసేయండి.