‘ కల్కి 2898 ఏడి ‘ లో ప్రభాస్ బైరవ.. మరి కల్కి ఎవరో తెలుసా.. వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటంటే..?!

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898 ఏడి. నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడు సినిమాను వెండితెరపై చూస్తామా అని ప్రభాస్ అభిమానులతో పాటు.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ పై నెట్టింట మరింత హైప్‌ మొదలైంది. సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Kalki 2898 AD': Meet Prabhas' mighty Bhairava - India Today

 

భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తుంటే మరి కల్కిగా ఎవరు కనిపించనున్నారు అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. కొంతమంది కల్కిగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ రూమర్లకు చెక్ పెడుతూ కల్కీ పాత్రలో కూడా ప్రభాస్ ఏ నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి బైరవకి, కల్కి కి మధ్య ఉన్న లింక్ ఏంటి.. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఎందుకు కలవాల్సి వస్తుంది.. వీళ్ళ మధ్యన ఉన్న సంబంధం ఏలా ఉంది అనే ఎన్నో సస్పెన్స్‌లు మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

మరి వీటన్నిటికీ సమాధానాలు ఇస్తూ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన ఖాతాలో భారీ బ్లాక్ బాస్టర్ కాతాలో వేసుకుంటాడు అంటూ సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. అలాగే ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి సంచలనం సృష్టించడం ఖాయం అంటూ అంచనాలు వేస్తున్నాయి.