అమ్మ బాబోయ్ ..రాజమౌళి మామూలోడు కాదుగా.. ఓటు వేయడానికి డైరెక్ట్ గా అలా..ఏం చేశాడో చూడండి..!

నేడు తెలంగాణ ఏపీలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే . చాలా మంది స్టార్ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఉదయం నుంచి పోలింగ్ బూత్ వద్ద జనాలు బారులు తీరారు . స్టార్ సెలబ్రిటీస్ కూడా ఏమాత్రం అసహనం చెందకుండా పెరిగిపోతున్న ఎండకి ఓపికగా తట్టుకొని మరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు . ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ ఆయన కూతురు సుస్మిత ..అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి తల్లి శాలిని అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరి కొంతమంది స్టార్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు .

రాజమౌళి సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు . అయితే రాజమౌళి ఈసారి వేసిన ఓటు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఫ్యామిలీతో ఇటీవల ఆయన వెకేషన్ ని ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లారు . కాగా ఓటు వేసేందుకు డైరెక్ట్ గా పోలింగ్ కే వచ్చేసాడు రాజమౌళి తన భార్య రమా రాజమౌళిని తీసుకొని దుబాయ్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగా డైరెక్ట్గా విమానాశ్రయం నుంచి పోలింగ్ బూత్ కి వచ్చి మరీ ఓటేశాడు .

దీంతో రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది . ప్రతి విషయంలోనూ రాజమౌళి డిఫరెంట్ .. ఈ విషయంలో కూడా డిఫరెంట్ .. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సాహసమే చేశాడు . అందరిని ఇన్స్పైర్ చేస్తున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ రాజమౌళి రమా రాజమౌళి ఓటు వేసిన తర్వాత దిగిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా రాజమౌళి ప్రెసెంట్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి నాయకుడు అనే టైటిల్ ని కన్ఫామ్ చేశాడట. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూడా నటించబోతున్నారు అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అంతేకాదు భారీ క్యాస్ట్ అండ్ క్రూ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట జక్కన్న..!