తమ కండిషన్స్ తో దర్శక, నిర్మాతలను ముప్ప తిప్పలు పెడుతున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇదే..?!

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ముద్దుగుమ్మ‌లంతా హీరోల‌తో పోటీపడి మరీ.. భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ పెంచేశారు. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్స్ వారు సినిమాల్లో నటించాలంటే షాకింగ్ ష‌ర‌తులు విధిస్తూ.. దర్శక, నిర్మాతలకు మరిన్నిటిస్టులు పెడుతున్నారు. అలా దర్శక నిర్మాతలకు షరతులు పెట్టి చుక్కలు చూపిస్తున్న స్టార్ హీరోయిన్లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ స్టార్ బ్యూటీ నయ‌నతార‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన మార్కెట్ మరింతగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇక ఎప్పటికప్పుడు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతున్న నయనతార.. ఎన్ని కోట్లు ఆఫర్ చేసిన సినిమా ప్రచారానికి మాత్రం దూరంగానే ఉంటారన్న సంగతి తెలిసిందే.

Nayanthara net worth 2023: A look at the South star's luxurious things

అడప దడప్ప సినిమా ప్రమోషన్స్ లో మాత్రమే తాజాగా ఆమె పాల్గొంటు సందడి చేసింది. ఇక మరో స్టార్‌ బ్యూటీ త్రిష సాయంత్రం 6 తర్వాత మేకప్ వేసుకోవడానికి అసలు ఇష్టపడదని.. ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన ఆమె ఈ షరతులు మాత్రం వదులుకోదట. అలాగే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా గ్లామరస్ పాత్రలకు గానీ, బోల్డ్ సన్నివేశాలు, స్కిన్‌షో చేయ‌టానికి కానీ అసలు ఇష్టపడదు. కథ‌ నచ్చకపోతే ఎలాంటి స్టార్ హీరో సినిమా నైనా రిజెక్ట్ చేస్తుందని సంగతి తెలిసిందే. ఈమె సినిమాలు నటించడానికి అంటే ముందే బోల్డ్ సన్నివేశాల్లో నటించనని దర్శక నిర్మాతలకు చెప్పేస్తుందట.

Sonakshi Sinha's red Payal Singhal lehenga took 1,000 hours to embroider |  Vogue India

మరో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా తన షరతులతో ట్విస్ట్ ఇస్తూనే ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా.. ఆమె ఇప్పటివరకు 35 సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ.. బోల్డ్ సన్నివేశాలు నటించే ఛాన్స్ లేదంటూ వెల్లడించేసింది. కొన్ని సందర్భాల్లో నాకు శృంగార సన్నివేశాల్లో నటించడం లేదన్న బాధ మాత్రం ఎకోసానా లేదంటూ వివరించింది. నాకు బోల్డ్ సన్నివేశాలు నటించడం చాలా అన్ కంఫ‌ర్ట‌బుల్గా ఉంటుందంటూ కామెంట్లు చేసింది. ఈ నిర్ణయం ఎప్పటికీ మారదు అంటూ సోనాక్షి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దబాంగ్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రెమ్యునరేషన్ పరంగాను టాప్ లో దూసుకుపోతుంది.