సౌత్ ఇండియాలోని క్రెసియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార కు సంబంధించిన ఏ ఒక్క వార్త అయినా సరే సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేస్తే ఉంటుంది . మరీ ముఖ్యంగా నయనతార ఈ మధ్యకాలంలో తన పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. సూపర్ మామ్ అంటూ స్పెషల్ ట్యాగ్ కూడా క్రియేట్ చేయించుకుంది. మనందరికీ తెలిసిందే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేశ్ శివన్ తో డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుని నయనతార ..సరోగసి ప్రాసెస్ ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులు అయ్యారు విగ్నేష్ – నయనతార .
తాజాగా మదర్స్ డే సందర్భంగా నయనతార తన ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది . ఆ పోస్ట్ సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయింది. నయనతార తన కొడుకును భుజాలపై ఎక్కించుకొని ఉండగా ఆ పిల్లాడు నయన్ ను నెత్తిమీద టపీ టపీ అంటూ బాధేస్తున్నాడు . అంతేకాకుండా పిల్లల్ని ఆడించేందుకు నయన్ చేస్తున్న పనులు నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రతి ఒక్క తల్లికి ఇదే సిచువేషన్ క్రియేట్ అవుతుంది .
బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ మదర్.. నయనతార కూడా అందుకు అతితురాలు కాదు అంటూ ప్రూవ్ చేసుకుంది. నయనతార పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది . కొంతమంది అయ్యయ్యో పాపం అంటుంటే మరి కొంతమంది ఇది ప్రతి తల్లి అనుభవించాల్సిన ఫీలింగే అంటూ చెప్పుకొస్తున్నారు . సోషల్ మీడియాలో నయనతార షేర్ చేసిన వీడియో బాగా బాగా వైరల్ గా మారింది..!
Happy Mother’s Day👩👦👦to all the Super Moms 😇💝 pic.twitter.com/BxYyOJl0vK
— Nayanthara✨ (@NayantharaU) May 12, 2024