నేను ఆ పని చేయడం వల్లే హీరోయిన్‌గా ఎదిగా.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స..?!

సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్‌లు సెలబ్రెటీలుగా మారాలంటే ఎంత శ్రమించాల్సి ఉంటుంది. దాంతోపాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ప్రతి నటీనటులకు ఒక్కొక్కరికి ఒక్క కారణం ఉంటుంది. ఎక్కువ శాతం మంది సినిమాలపై, నటనపై ఉన్న ఆసక్తితో.. ప్యాషన్ తో.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తూఉంటారు. అలా స్టార్ సెలబ్రిటీలుగా ఎదగడానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కారణాలు ఉంటాయి. అదే విధంగా తాను కూడా స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవడానికి ఓ కార‌ణం ఉందంటూ చెప్పుకొచ్చింది స్టార్ బ్యూటీ కృతిసనన్‌. బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్‌కు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Raabta Movie Trailer 2017 | Sushant Singh Rajput & Kriti Sanon | Review -  YouTube

ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్‌ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గర అయింది కృతిసనన్. ఇక ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించడంతో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఫుల్ బిజీ బిజీగా గడుపుతుంది. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిసనన్‌ మాట్లాడుతూ.. బాలీవుడ్ రబ్తా నాకు మూడో సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది.

Kareena Kapoor Khan, Kriti Sanon And Tabu's Crew Teaser To Release  Tomorrow; Deets Inside - News18

అయినా ఈ సినిమా ఫ్లాప్ అని నేను ఎప్పటికీ అనుకోను. ఈ సినిమా ద్వారా నేను ఎంతో నేర్చుకున్నా.. అందులో రోల్ కోసం చాలా కష్టపడి రెడీ అయ్యా.. సెట్ లో కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. గుర్రపు స్వారీ, నీటిలో సన్నివేశాలు ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాను. నా కెరీర్‌లో సక్సెస్ అవ్వడానికి కారణమైన వాటిలో ఈ సినిమా కూడా ఒకటి. ఇది నా కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ. ఎన్నో సంతోషకరమైన జ్ఞాపకాలను అందించిన మూవీ అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం కృతిసనన్‌ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.