“దయచేసి ఆయనకి ఓటు వేయకండి”.. లాస్ట్ మినిట్ లో బిగ్ ట్వీస్ట్ ఇచ్చిన శివాజీ ..!

ప్రజెంట్ ఏపీలో ఎలాంటి హాట్ హాట్ వాతావరణం నెలకొందో తెలిసిందే . ఆఫ్ కోర్స్ బయట సూర్యుడు భగభగ మండిపోతున్న సరే ఏపీ జనాలు మాత్రం ఓట్లు వేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. మనకు తెలిసిందే.. నేడు ఏపీ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి . తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉండగా .. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కలిపి జరుగుతున్నాయి . ఈ క్రమంలోనే జనాలు ఉదయమే లేచి ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి జనాలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

పోలింగ్ బూత్ వద్ద కిలోమీటర్లు మేర బారున తీరిన జనాలను మనం చూడొచ్చు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒకప్పటి హీరో బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి .దీంతో ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత అందరికీ నెలకొంది. “వైయస్ జగన్కు అసలే ఓటు వేయకండి ఎందుకో మీ అందరికీ బాగా తెలుసు.. ఒకసారి నమ్మి ఓటు వేస్తేనే రాష్ట్రాన్ని దోచేసుకున్నాడు ..జనాలకి ఏమి ఉపయోగపడే పనులు చేశాడో తెలియదు కానీ, ఆయన మాత్రం మంచిగా డబ్బులు సంపాదించుకున్నాడు”..

” గత ఐదు ఏళ్లలో జనాలు సొమ్ముతో ఆయన ఎన్ని కోట్ల ఆస్తులు దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే.. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పడానికో లేదా మిమ్మల్ని మభ్యపెట్టడానికో ఇలా చెప్పడం లేదు .. అవగాహన కల్పిస్తున్నాను .. ల్యాండ్ టైటిలింగ్ రైతుల మీదకు పిడుగు లాంటిదే అని గుర్తుంచుకోండి “అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ శివాజీ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది . ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరొకవైపు జగన్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!