సరికొత్త లుక్ లో హిట్ పెంచేస్తున్న శ్రీ లీల.. దిమ్మతిరిగే లేటెస్ట్ స్టిల్స్ వైరల్..?!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ‌లీల‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో తాలూరు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత రవితేజ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ అమ్మడు.. ఎంత వేగంగా స‌క్స‌స్‌లు అందుకుందో.. అంతే వేగంగా ఫ్లాపులను చూసింది. అయితే ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీ లీల పేరు మాత్రం వినిపిస్తుంది.

అంతకుముందు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజ హెగ్డేలాంటి ముద్దుగుమ్మల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీ లీల పేరే వినిపిస్తుంది. ఇక మొదట్లో పెళ్లి సందడి, ధమాకా సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీ‌లీల తర్వాత ఊహించిన రేంజ్ లో ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేదు. ఇక బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అయినప్పటికీ శ్రీలీల.. కేవలం బాలయ్య కూతురుగా మాత్రమే గుర్తింపు తెచ్చుకుంది. స్కంధ‌, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలా శ్రీలీలకు వరుసగా ఫ్లాప్‌లు ఎదురయ్యాయి. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

రీసెంట్గా శ్రీ లీల గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకి జంటగా నటించింది. ఎప్పటిలాగే డ్యాన్స్ ఇరగదీసిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ఊహించిన స్థాయిలో దక్కించుకోలేకపోయింది. ఇక తాజాగా శ్రీ లీలా టాలీవుడ్ లో అవకాశాల కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వెరైటీ ఫొటోస్ ను షేర్ చేసుకుంది. ఆమె లేటెస్ట్ లుక్స్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరింత హాట్ నెస్ తో.. క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. స్టైలిష్ గొగ‌ల్స్‌ పెట్టి మెలికలు తిరుగుతూ ఫోజులు ఇచ్చింది. జీన్స్ డ్రెస్ లో ఈమె కెమెరాకు ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ గా మారాయి.