ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాలకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఏపీలో అదే విధంగా తెలంగాణలో పోలింగ్ జరుగుతుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపై ఉత్కంఠత.. నెలకొంది . మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది .
చాలామంది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు . మెగా ఫ్యామిలీ టోటల్గా కదిలి వచ్చి పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ పిఠాపురం నియోజకవర్గం ప్రజలను అభ్యర్థించారు . అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ముగ్గురుని పెళ్లి చేసుకొని ఇద్దరికీ విడాకులు ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ ఎవరికి ఎంత భరణం ఇచ్చాడొ అనే విషయం వైరల్ అవుతుంది. రేణు దేశాయ్ చాలా అమాయకురాలని చెప్పిన ఆయన .. ఆమె పేరు మీద ఇల్లు రాశానని .. గతంలో చెప్పుకొచ్చాడు .
అకీర – ఆధ్యా చదువు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని కూడా వివరించాడు . అంతేకాదు తల్లిదండ్రులుగా ఎంత ఆస్తి ఇచ్చాము అన్నది ముఖ్యం కాదు అని వాళ్ళ ఎదుగుదలకు ఎంత సపోర్ట్ చేశామన్నదే ఇంపార్టెంట్ అంటూ క్లారిటీ ఇచ్చారు . తన తండ్రి కూడా తనకు ఎటువంటి ఆస్తి ఇవ్వలేదని ధైర్యం నిజాయితీ ఇచ్చాడు అని ..ఆ స్కిల్స్ తో నేను ఇప్పుడు ఇంత పెద్ద వాడిని అయ్యానని తన పిల్లల ప్రస్తుతం ఓ సగటు ఉద్యోగి పిల్లలు మాదిరిగానే పెరుగుతున్నారు అని చెప్పుకొచ్చారు . అంతేకాదు గతంలో పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి చేసుకున్న నందిని ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్న అన్నాలెజినోవో కు సంబంధించిన వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతుంది..!!