ఎటువంటి ఎమోజీస్ లేకుండా క్లీంకారా ఫోటో షేర్ చేసిన ఉపాసన.. ఎంత అందంగా ఉందో మెగా మనవరాలు చూడండి..!

మెగా మనవరాలు క్లిన్ కారా ఫోటో ఇప్పటివరకు రామ్ చరణ్ – ఉపాసన రివీల్ చేయని విషయం తెలిసిందే. దిష్టి తగులుతుంది అన్న భయమో.. లేకపోతే వేరే కారణం ఏదైనా కావచ్చు..క్లీంకార ముఖాన్ని ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ రివీల్ చేయలేదు .. అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ ట్రెండ్ అవుతూ లీక్ అవుతూ వైరల్ అవుతున్నా కానీ.. ఆమె ముఖం పూర్తిగా ఎప్పుడూ రివీల్ కాలేదు .

రీసెంట్గా మదర్స్ డే సందర్భంగా ఉపాసన క్లీన్ కారా ఫోటోను రివిల్ చేసింది . మదర్స్ డే సందర్భంగా ఉపాసన తన తల్లితో తన కూతురితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది . ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . “నా మొదటి మాతృ దినోత్సవాన్ని ఇంత ప్రత్యేకమైనదిగా చేసిన క్లిన్ కారాకు ధన్యవాదాలు ..నా ఫస్ట్ మదర్స్ డే ఇది. ఇది చాలా అద్భుతం. నా ఇతర ఇతర ఇద్దరి పిల్లలను మిస్ అవుతున్నాను.. ఫస్ట్ మదర్స్ డే శుభాకాంక్షలు ” అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఉపాసన పోస్టు వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ – ఉపాసన మొదటి బిడ్డను కనడానికి ఏకంగా 11 ఏళ్ల సమయం తీసుకున్నారు. ఈ టైం లో వీళ్ళని చాలామంది ట్రోల్ చేశారు. అయినా సరే ఉపాసన ఏమాత్రం పట్టించుకోకుండా చాలా కాన్ఫిడెంట్గా తన ఆరోగ్యాన్ని చూసుకొని ఆ తర్వాత తన బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసెంట్ క్లీం కార తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట..!