బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ కు కారణం తేజస్విని.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన చిన్నల్లుడు..?!

నందమూరి నట‌సింహం బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల హ్యాట్రిక్‌ హీట్లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ఫుల్ జోష్లో బిజీబిజీగా గడుపుతూ ఓవైపు సినిమాలోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. అలాగే అన్‌స్టాపబుల్ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు. చాలా ఏళ్ల పాటు ఫ్లాప్‌ల‌ను చెవి చూసిన బాలయ్య.. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. చివరిగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇది కేవలం ఈ జోనర్ అని చెప్పడానికి లేదు.

Balakrishna daughter becomes producer

ఫన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, డాటర్ సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు కలిగిన ఈ సినిమా కొత్త తరహా సబ్జెక్ట్ అయినప్పటికీ.. మంచి సక్సెస్ సాధించింది. ఇక బాలయ్యలో వచ్చిన ఈ మార్పు సినిమాల పరంగా వరుస సక్సెస్‌లకు ఓ బలమైన కారణంగా ఉందంటూ వివరించాడు ఆయన చిన్నల్లుడు శ్రీ భరత్. ఇప్పుడు శ్రీ భరత్ బాలయ్య హ్యాట్రిక్‌ హిట్లపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బాలయ్య సక్సెస్‌ల వెనుక ఓ వ్యక్తి ఉన్నారని.. అది ఎవరో కాదు ఆయన చిన్న కూతురు తేజస్విని అంటూ వివరించాడు. క్రియేటివ్ సైడ్ నుంచి టాలెంట్ ఉందని.. మేకింగ్, ప్రొడక్షన్ వంటి వాటిపై ఆసక్తి ఉందని బాలయ్య ప్రతి సినిమాలోని ఆమె ఇన్వాల్వ్ అవుతుందని వివరించాడు.

Sri Bharath: పార్టీకి దూరమైన వారు తిరిగి రావాలనుకుంటే ఆదరిస్తాం.. | If  those who are away from the party want to come back we will welcome them  says Sri Bharath PVCH

బాలయ్య యంగ్‌ డైరెక్టర్లతో పనిచేయడానికి కారణం కూడా తేజస్విని అంటూ చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ కి సంబంధించిన ప్ర‌తి చిన్న విషయాన్ని, ప్రతి అంశాన్ని బాలయ్య తేజుతో డిస్కస్ చేస్తారని.. ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే అంటూ వివరించాడు. ఇటీవల ఆమె ఇంకా యాక్టివ్ గా ఉంటుందని.. ఆమె ఇంట్రెస్ట్ మరింతగా పెరిగిందని.. క్రియేటివ్ సైడ్‌లో ఆమెకు మంచి పట్టు కూడా ఏర్పడింది అంటూ వివరించాడు. ఆమె ఫీడ్ బ్యాక్ తరువాతే బాలయ్య యంగ్‌ డైరెక్టర్లతో పని చేస్తున్నారని వివరించాడు. బాలయ్య సక్సెస్ మంత్ర వెనుక తేజస్విని పాత్ర కూడా ఉందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భరత్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి.