ప్రశాంత్ వర్మ, ర‌ణ్‌వీర్ మూవీ టైటిల్ ఫిక్స్.. మరీ ఇంత వైల్డ్ గా నా..?!

ఆ!, కల్కి, అద్భుతం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ వర్మ ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్ లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజసజ్జ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసి.. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో టాప్ లో నిలచింది. స్టార్ హీరో సినిమాలను సైతం తలదన్ని విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకట్టుతుంది. దీంతో ప్రశాంత్ వర్మ క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ప్ర‌స్తుతం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ లో కూడా ప్రశాంత్ వర్మ సినిమా కోసం ఆడియన్స్ ఆశ‌క్తి చూపుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

Ranveer Singh: Prasanth Varma की मेगा बजट फिल्म में हुई Ranveer Singh की एंट्री !! बॉक्स ऑफिस पर अब आएगा तूफान | Times Now Navbharat

తాజాగా ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ తో ఓ సినిమా చేయనున్నారు అంటూ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఈ వార్తపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్క నుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీనికి ఓ వైలెంట్ టైటిల్ను ఫిక్స్ చేశార‌ట‌. తన సినిమాలకు టైటిల్స్ ఎప్పుడూ కాస్త కొత్తగానే పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ప్రశాంత్ వర్మ. అలాగే ఈ సినిమాకు బ్రహ్మ రాక్షస అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఈ టైటిల్ వినగానే ప్రేక్షకులకు మరోసారి ఏదో వండర్ క్రియేట్ చేయబోతున్నారని అంచనాలు మొదలయ్యాయి.

Prashanth Varma Movies, News, Photos, Age, Biography

హనుమాన్ సినిమా నుంచి సూపర్ హీరోల కథలపై దృష్టి సారించిన ప్రశాంత్ వర్మ.. వీరి కాంబో కోసం కూడా అలాంటి జానర్‌నే ప్లాన్ చేసి ఉంటారని టాక్. ఇటీవల ప్రశాంత్ వర్మ రణ్‌వీర్‌ను కలిసి.. కథ వినిపించాడ‌ట. ప్రశాంత్ వర్మ నరేషన్, కథను చెప్పిన విధానం బాగా నచ్చడంతో రణ్‌వీర్‌ సింగ్ వెంటనే సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తుంది. మూవీ షూటింగ్ హిందీలో జరిగినా.. మిగతా భాషల్లో కూడా సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా పనుల్లో బిజీగా గ‌డుపుతున్న ప్రశాంత్ వర్మ.. ఈ సినిమా పూర్తయిన తర్వాత బ్రహ్మ రాక్షస సినిమాపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారని సమాచారం. ఇక ఈ సినిమా గాని బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుందంటే ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు.