‘ గేమ్ చేంజర్ ‘ కోసం దేవర రిలీజ్ డేట్ ని త్యాగం చేయనున్న తారక్.. మ్యాటర్ ఏంటంటే..?!

ఈ ఏడాది ద్వితీయద్దంలో బడా హీరోల సినిమాలు వరుసగా ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్లో పాన్ ఇండియన్ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ ఓజి, రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఎన్టీఆర్ దేవర సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్నాయి. అయితే ఓజీ.. దేవర రిలీజ్ డేట్‌లు ఆల్రెడీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

OG (upcoming film) - Wikipedia

సెప్టెంబర్ 27న ఓజీ, అక్టోబర్ 10న దేవర సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ మూవీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందని.. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ పాల్గొనలేకపోతున్నాడని.. దీంతో సినిమాకు ఆలస్యం అవుతుందని అంత భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓజీ మూవీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ నుంచి చేంజ్ అవుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే సెప్టెంబర్ నుంచి ఓజీ మూవీ రిలీజ్ డేట్ మారితే దేవర మూవీ ఓజీ రిలేజ్ డేట్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. దేవర టీం ఓజీ పోస్ట్ పోన్ వార్త కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది.

Devara Announcement: Ram Charan Fans Disappointed

ఓజీ తేదీని దేవర ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతుందట. ఇక దేవర తన డేట్ ని వదిలేసి ముందుకు వెళితే.. ఇప్పటివరకు విడుదల తేదీని అనౌన్స్ చేయని చ‌ర‌ణ్ గేమ్ చేంజర్‌కు.. దేవర రిలీజ్ డేట్‌ను తీసుకోవాలనే ప్రయత్నాల్లో మేక‌ర్స్ ఉన్నార‌ట‌. ఇక ఈ రెండు సినిమాలకు ఓజీ వాయిదా వార్త ప్ర‌ధానంగా మారిందని తెలుస్తుంది. ఇక ఓజీ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.