లావణ్య త్రిపాఠిని బూతులు తిడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. అంత పెద్ద తప్పు ఏం చేసిందంటే..?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారా ..?అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. దానికి కారణం లావణ్య త్రిపాఠి చేసిన పిచ్చి పని అంటూ తెలుస్తుంది . లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ .. వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా రాజ్యమేలేస్తుంది . కాగా తనదైన స్టైల్ లో సినిమాల్లో ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది .

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చిన ఆచితూచి అడుగులు వేస్తుంది . పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ మెగా ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా పిఠాపురంలోకి వచ్చి ప్రచారం చేయగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతూ వచ్చారు. అయితే మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆయనకి సంబంధించి ఒక పోస్ట్ కూడా చేయకపోవడం ఆయనకు సపోర్టివ్ గా మాట్లాడకపోవడం ఫాన్స్ కి మండిస్తుంది .

అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉండే జనాలు పూజలు చేస్తూ ఉంటే మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆవకాయ పచ్చడి పోస్ట్ షేర్ చేయడం సంచలనంగా మారింది. మామిడికాయ పచ్చడి మేకింగ్ అంటూ టబ్లో పచ్చడ్ని కలుపుతున్న ఫోటో షేర్ చేసింది లావణ్య త్రిపాఠి . దీంతో అది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలవాలి అని ఒక్క మెసేజ్ కూడా చేయకుండా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నావా..? నీకు పవన్ కళ్యాణ్ కన్నా పచ్చడి ముఖ్యమా..? అంటూ ఏకేస్తున్నారు..!!