రాజమౌళికి ..సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మొదటి నుంచి తన పని తను చూసుకునే రాజమౌళి అంటే అందరికీ ఇష్టమే. కానీ ఇప్పుడు ఆయన తన పని తాను చూసుకుంటూ ఉంటే మాత్రం ఒక హీరో విషయంలో అందరూ తప్పు పడుతున్నారు . వేలు ఎత్తి చూపిస్తున్నారు . దీంతో ఆయన పేరు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది.
ఆయన మరెవరో కాదు పవన్ కళ్యాణ్ . ప్రజెంట్ పవన్ కళ్యాణ్ పేరు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో హల్చల్ చేస్తుందో వైరల్ అవుతుందో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. రాజమౌళి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేయకపోవడం అట్లీస్ట్ ప్రజలకు అవగాహన కూడా ఎలక్షన్స్ పై అవగాహన కల్పించకపోవడంతో రాజమౌళి అంటే పడని వాళ్ళు కొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు .
మరీ ముఖ్యంగా ఇతగాడా..? మాకు చెప్పేది .. సినిమాలు తీసి డబ్బులు అకౌంట్ లో వేసుకోవడం తప్పిస్తే .. సమాజానికి ఉపయోగపడే పనులు ఏం చేశాడు అంటూ మండిపడుతున్నారు. దీనంతటికీ కారణం ఆయన పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకపోవడమే అంటూ తెలుస్తుంది . అంతేకాదు పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టం ఆయనతో సినిమాను తెరకెక్కించాలి అని అనుకుంటున్నాను అని గతంలో చాలా సార్లు చెప్పిన రాజమౌళి ఇప్పుడు ఆ ప్రేమ నిజాయితీ ఏమయ్యాయి అని రాజమౌళి స్వార్థపరుడు అని చాలా ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!