పవన్ కళ్యాణ్ గెలవాలని తివిక్రమ్ ఏం చేస్తున్నాడో తెలుసా.. ఇది రియల్ ఫ్రెండ్ షిప్ అంటే..!

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎంత జాన్ జిగిడి దోస్తులు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం . ఒకరి విధివిధానాలను మరొకరు గౌరవించుకుంటూ ఉంటారు . ఆ విషయం మనకు తెలిసిందే . వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలకు కూడా ఎలా వైవిధ్య భరితంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమాల పరంగానే కాకుండా పర్సనల్ పరంగా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పవన్ కళ్యాణ్ కి సజెషన్స్ ఇస్తూ ఉంటారు .

ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ . అయితే పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ చాలామంది స్పెషల్ గా కోరుకుంటున్నారు కూడా.. వాళ్ళల్లో ఒకరే త్రివిక్రమ్ శ్రీనివాసరావు .

పవన్ కళ్యాణ్ గెలవాలి అని ఆయన తమ కులదైవం గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారట. అందరిలా ఆడంబరాలు పోకుండా దేవుడిని నమ్ముకుంటూ పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి ఆయనకు అంతా మంచే జరగాలి ..ఆయన అనుకున్న కోరికలు నెరవేరాలి అంటూ పవన్ కళ్యాణ్ బాగుండాలి అని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!