ఆ విషయంలో తమ్ముడు నాగబాబుకు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..!? చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం సార్..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. ఏపీ రాజకీయాలలో నాగబాబు పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. ఎలక్షన్స్ ముందు వరకు కూడా చాలా చాలా ఫైర్ బ్రాండ్ ల దూసుకెళ్లిన నాగబాబు ఎలక్షన్స్ మూమెంట్లో సడన్గా స్లో అయిపోయారు . దానికి కారణం పవన్ కళ్యాణ్ ఎలా అయినా సరే ఈసారి గెలవాలి అని నిర్ణయం తీసుకోవడమే. తెలిసి తెలియక ఒక మాట మాట్లాడినప్పుడు తన కారణంగా పవన్ కళ్యాణ్ కి ఎక్కడ నెగెటివిటీ ఏర్పడుతుందో అన్న భయంతో నాగబాబు కూడా సైలెంట్ గా ఉండిపోయాడు అంటూ పలువురు సినీ విశ్లేషకులు ఓపెన్ గా డిబేట్స్ లో చెప్పుకొచ్చారు.

అయితే ఎలక్షన్స్ పోలింగ్ పూర్తవగానే అల్లు అర్జున్ పై పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ అందరికీ మండిపోయేలా చేసింది . కొంతమంది మెగా ఫాన్స్ కూడా నాగబాబుకి నోటి దూకుడు ఎక్కువ అంటూ మండిపడ్డారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . నాగబాబుకు చిరంజీవి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారట . “మన కుటుంబాన్ని వేలెత్తే విధంగా మనం సోషల్ మీడియాలో వైరల్ కాకూడదు.. పరువు తీసుకోకూడదు.. తిట్టుకున్న కొట్టుకున్న మన కుటుంబం మనదే ..మనం ఒకరికి చులకన కాకూడదు అది కూడా రాజకీయాల కారణంగా అస్సలు కాకూడదు ..గతంలో నేను చేసిన తప్పును ఇప్పుడు నువ్వు చేయకూడదు “అంటూ నాగబాబుకి పరోక్షకంగా వార్నింగ్ ఇచ్చారట చిరంజీవి.

ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అయిపోతుంది. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చిరంజీవికి సపోర్ట్ చేస్తూ నాగబాబుకి ఇంకా గట్టిగా వార్నింగ్ ఇవ్వండి సార్ అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . మరి కొంతమంది చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం సార్. మీ బ్రదర్ తిట్టాల్సిన మాటలన్నీ తిట్టేశాడు గా అంటూ ఫైర్ అవుతున్నారు..!!