తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీ టాస్క్‌లతో తన సత్తా చాటుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 325కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన.. తన కొడుకు మహేష్ బాబును తన నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్.. తర్వాత స్టార్ హీరోగా సక్సెస్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన కెరీర్‌లో మహేష్‌కు మొదట హిట్ అందించిన సినిమా మురారి. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా షూట్ టైంలో కృష్ణవంశీకి.. సూపర్ స్టార్ కృష్ణకు మధ్యన చిన్న వివాదం తలెత్తిందని వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ గొడవేంటో.. వారిద్దరి మధ్య వివాదాలకు కారణం ఏంటో.. ఒకసారి చూద్దాం. మురారి సినిమా క్లైమాక్స్ విషయంలో మంచి ఫైట్ పెట్టమని కృష్ణ.. కృష్ణవంశీని అడిగారట. అయితే కృష్ణవంశీ మాత్రం ఈ కథ ప్రకారం ఇక్కడ ఫైట్ అసలు పెట్టకూడదు సార్.. స్మూత్గా సినిమాను ముగించేయాలి అంటూ వివరించారట. కానీ.. హీరో అన్న తర్వాత ఫైటింగ్స్ చేయాలి కదా.. అందుకే చెబుతున్నా.. ఇలా ప్లాట్‌గా సినిమా ఉంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు అని వివరించాడట.
కృష్ణవంశీ మాత్రం తను నమ్మింది చేస్తానని కరాకండిగా చెప్పడంతో కృష్ణవంశీకి, కృష్ణకు మధ్యన చిన్నపాటి ఫైట్ జరిగిందట. కానీ మొత్తానికి కృష్ణవంశీ చెప్పినట్టుగానే ఫైనల్ గా క్లైమాక్స్ ఎలాంటి మార్పు లేకుండా సింపుల్ గా ముగించారు. కృష్ణ మాట వినకుండా కృష్ణవంశీ తన స్టైల్ లో సినిమాను తెరకెక్కించిన.. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక మహేష్ కెరీర్‌లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా తర్వాత మహేష్ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో ఓ పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.