సినీ ఇండస్ట్రీలో నటులుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న తరువాత ఇతర రంగాల్లో రాణించాలని ఆసక్తితో ప్రొడ్యూసర్లుగా, దర్శకులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలు దర్శకులుగా మారి తమ సత్తా చాటుతున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో దర్శకులుగా మరి సక్సెస్ అందుకున్న స్టార్ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్ :
మొదటి సూపర్ హిట్ సినిమాలన్నీ తీసి విశ్వవిఖ్యాతగా, నటసార్వభౌమడిగా బిరుదులు అందుకున్న సీనియర్ ఎన్టీఆర్.. కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో ఆరాధ్య దైవంగా ముద్ర వేసుకున్నారు. అలా స్టార్‌డం సంపాదించుకున్న తర్వాత.. తానే స్వయంగా కొన్ని సినిమాలుకు దర్శకుడిగా వ్యవహరించారు ఎన్టీఆర్. అలా ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో దాన వీర శూరకర్ణ ఒకటి. ఈ సినిమాను మొదట వేరే డైరెక్టర్ తో తీయాలని భావించిన.. ఆయన ప్రాజెక్ట్ నుంయి తప్పుకొడంతో తనే స్వయంగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది.
కృష్ణ :
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కృష్ణ.. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో సక్సెస్లు అందుకున్నాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీకి ఏ టెక్నాలజీ రావాలన్నా కూడా అది కృష్ణ ద్వారానే సాధ్యమౌతుంది అనేంతలో ఒకప్పుడు మంచి పేరు తెచ్చకున్నారు. మొదట కలర్ సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన.. మొదట కౌబాయ్ గెటప్ లోను నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే హీరో గానే కాకుండా.. తానే తన సొంత సినిమాకు దర్శకుడుగా వ్యవహరించాడు. సింహాసనం సినిమాతో డైరెక్టర్‌గా మారి సినిమాను తీసి మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. ఈ సినిమాతో పాటు ఎన్నో సినిమాలకు దర్శకునిగా వ్యవహరించి విజేతగా నిలిచాడు.
కమల్ హాసన్ :
తమిళ్ సినీ ఇండస్ట్రీలో లోకనాయకుడిగా ఇమేజ్ క్రియేట్‌చేసుకున్న కమలహాసన్‌కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోన ఎన్నో సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. విలక్షణ నటుడిగా ప్రసంసతందుకున్న కమల్‌హాసన్.. విశ్వరూపం సినిమాతో దర్శకుడుగా మారి ఈ సినిమా సక్సెస్ తో డైరెక్టర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత విశ్వరూపం 2 సినిమా వచ్చిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. విశ్వరూపంతో మాత్రం ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందింది. ఇక వీళ్ళే కాకుండా యంగ్ హీరో విశ్వక్‌సేన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది హీరోలు తమ సినిమాలకు దర్శకులుగా వ్యవహరించారు.