ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్ని కృష్ణుడు సౌత్ స్టార్‌హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా ఎదిగిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారి ఫేవరెట్ హీరో, హీరోయిన్లు లేదా నటీ,నటుల గురించి తెలుసుకోవాలని అభిమానులు తెగ ఆరాటపడిపోతూ ఉంటారు. ఈ క్రమంలో వారి ఫేవరెట్ హీరోలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చిందా..? నెటింట వాటిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం పైన చూస్తున్న ఈ చిన్ని కృష్ణుడి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఈయన ప్రస్తుతం సౌత్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.

Watch Nandha | Prime Video

ఇక ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. త్వరలోనే పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆయన మరెవరో కాదు సూర్య. పేరుకే తమిళ్ హీరో అయినా టాలీవుడ్ ప్రేక్షకుల్లోను మంచి క్రేజ్‌ సంపాదించుకుని.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇక సూర్య సినిమా టాలీవుడ్‌లో రిలీజ్ అవుతుంది అంటే చాలు.. అభిమానుల్లో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఆసక్తి మొదలవుతుంది. ఈ క్రమంలో సూర్య సినిమాలకు టాలీవుడ్‌లో మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే సూర్య.. తను నటించే పాత్ర కోసం ఎంతటి రిస్క్ చేయడానికి అయినా సిద్ధమవుతాడు.

Suriya - Biography, Height & Life Story | Super Stars Bio

తండ్రి శివకుమార్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సూర్య.. 1997లో నేరుక్కు నెరా అనే తమిళ్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక నందా సినిమాతో 2001లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత 2005లో గజినీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. దీంతో సూర్యకు కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు ద‌క్కించుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం సూర్య కంగువా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమా భారీ లెవెల్లో రిలీజ్ కానుంది. డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడది అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.