సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతమంది సెలబ్రిటీలు తమ పేర్లు కొంచెం మార్చుకోవడం.. లేదా పేర్లలో లెటర్ యాడ్ చేయడం, తీసేయడం లాంటివి కామన్ గా చేస్తూ ఉంటారు. పేర్ల ముందు వెనుక ఏదో ఒకటి కొత్తగా చేర్చడం.. లేదంటే జతచేసిన పదాలను తీసేయడం.. లాంటివి సాధారణంగా జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇదే విధంగా ఓ యంగ్ హీరో తన పేరులో జతచేసిన ఓ పదాన్ని తీసేసి మరో పదాన్ని యాడ్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ ప్రకటన చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు తన కొత్త పేరు ఏంటో ఒకసారి చూద్దాం.
ఆ యంగ్ హీరో ఎవరో కాదు ఆకాష్ పూరి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. పలు సినిమాల్లో నటించాడు. ఇక 2018లో మెహబూబా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఈ మూవీ తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాల్లోను నటించి మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆకాష్.. ప్రస్తుతం పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నటిస్తున్నాడు. ఈ క్రమంలో జులై 25 (నేడు) తన పుట్టినరోజు సందర్భంగా పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు.
ఎన్నాళ్లు తనని ఆకాష్ పూరి అని పిలిచారని.. ఇప్పుడు ఆకాష్ జగన్నాథ్ అని పేరు తాను మార్చుకున్నట్లుగా వివరించాడు. అయితే ఆకాష్ తన పేరు చివర పెట్టుకున్న ఈ రెండు పేర్లు కూడా తండ్రి పేరులే కావడంతో.. ఇంత సడన్గా అసలు ఇప్పుడు పేరెందుకు మార్చినట్లు.. పైగా పూరి లేదా జగన్నాత్ ఈ రెండు కూడా తండ్రి పేరులే కదా మార్చడం వల్ల ప్రయోజనం ఏమై ఉంటుంది. కెరీర్ పరంగా కలిసి రావాలని ఉద్దేశంతో ఎవరైనా ఇచ్చిన సలహాతో ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడా అంటూ.. నడిజనుల్లో సందేహాలు మొదలయ్యాయి.
View this post on Instagram