సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చిరంజీవి. మొదట చిన్నచిన్న పాత్రలో నటనతో సత్తా చాటి హీరోగా అవకాశాన్ని దక్కించుకున్న చిరు ఎన్నో హిట్ సినిమాలు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తర్వాత మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి ఎంతోమంది హీరోలను టాలీవుడ్ పరిచయం చేశాడు. మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా అరడజనుకుపైగా హీరోలు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ ఇలా ఎంతోమంది హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక బన్నీ, చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
మెగా బ్రదర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకోని లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రాజకీయపరంగా తన సత్తా చాటుకుని డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు. ఇక చిరంజీవిని మెగా స్టార్‌గా మార్చిన వాటిలో డ్యాన్స్ కూడా ఒకటి. ఎలాగైనా స్టార్ హీరో అవ్వాలని ఫిక్స్ ఐన చిరంజీవి నటనతో పాటు డ్యాన్స్‌లోను శిక్షణ తీసుకున్నారు. భరతనాట్యంపై పట్టు ఆయనను హీరోగా, గొప్ప డ్యాన్సర్ గా ఇండస్ట్రీ నిలబెట్టింది. చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ మరో హీరోకి ఉండదన్నడంలో అతిశయోక్తి లేదు. ఇక చిరు తర్వాత బాగా డ్యాన్స్ చేసే వారిలో ఇప్పుడు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ల పేర్లు వినిపిస్తాయి.
వీరిద్దరి డ్యాన్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటాయి. విపరీతంగా యూత్.. వీరి స్టెప్స్‌కు కనెక్ట్ అవుతారు. 2007లో చిరంజీవి వారసుడిగా రాంచరణ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తారక్, బన్నీ అప్పటికే హీరోలుగా మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే చిరంజీవి ఇండస్ట్రీలోకి చరణ్ అడుగు పెట్టక ముందు ఆయన విషయంలో ఎంతగానో బాధపడేవారట.. చిరు కుటుంబంలో ఎలాంటి ఈవెంట్ జరిగినా అల్లు అర్జున్ చాలా యాక్టివ్ గా చిరు పాటలకు డ్యాన్స్ అదరగొట్టేవాడట. దీంతో చిరంజీవి బన్నీని చూసి తెగ మరిచిపోయావాడట. రామ్ చరణ్ కు అసలు డ్యాన్స్ చేయడం రాదట.
దీంతో చిరంజీవి చాలా ఆవేదన చెందాడట. తనకు డ్యాన్స్ ద్వారా మంచి పేరు వచ్చింది. కొడుకు కనీసం మోస్తారు కూడా డ్యాన్స్ చేయకపోతే.. పరువు పోతుందేమో.. ఇండస్ట్రీలోకి పరిచయం చేసిన తర్వాత డ్యాన్స్ విషయంలో తను కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ బాధపడేవాడట. బన్నీని చూసి డ్యాన్స్ చేయడం నేర్చుకో అంటూ తిట్టేవారట. ఇక రాంచరణ్ తన మొదటి సినిమా చిరుతలో తన డ్యాన్స్ తో ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాడో తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్‌లో తారక్, బన్నీల తర్వాత రామ్ చరణ్ పేరు వినిపిస్తుంది.