ప్ర‌భాస్ ఫ‌స్ట్ క్ర‌ష్ చెప్పేశాడు.. ఆమె ఎవ‌రో తెలిస్తే సూప‌ర్ థ్రిల్‌..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఫ్యాన్ ఇండియన్ హీరోగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. వరుస‌ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ లైఫ్ టీడ్ చేస్తున్న డార్లింగ్.. చివరిగా నటించిన సలార్, కల్కి సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకొని మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇక నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన కల్కి సినిమా రూ.1000 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్స్‌లో రన్ అవుతూనే ఉంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ప్ర‌భాస్ పర్సనల్ లైఫ్ లో 44 ఏళ్ళు వచ్చిన ఇంకా వివాహం చేసుకోలేదు. బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్‌ను సొంతం చేసుకున్నాడు.

కాగా ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గ‌త కొంత‌కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లతో ఎఫైర్‌ ఉన్నట్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి.. ప్రభాస్‌కు ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసేస్తానని వివరించింది. కానీ ఆయన మాత్రం ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్లో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ మాట్లాడుతూ తన ఫస్ట్ క్రష్ ఎవరో రివీల్ చేశాడు. తన ఫస్ట్ క్రష్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

మీ ఫస్ట్ క్రష్ ఎవరు.. స్కూల్లోనా.. లేదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటూ యాంకర్ ప్రశ్నించగా.. ప్రభాస్ దానికి రియాక్ట్ అవుతూ.. స్కూల్లోనే నా ఫస్ట్ క్రష్ అంటూ వివరించాడు. కానీ ఆమె పేరు అడగగా.. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఈ క్రమంలో యాంకర్ మరోసారి ఏ క్లాస్ లో ఉన్నప్పుడు లవ్ చేశారు అని ప్రశ్నించారు. తను నా క్లాస్మేట్ కాదని.. ఓ టీచర్ నా ఫస్ట్ క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు. నేను చదివింది చెన్నైలో. ఆస్కూల్లో టీచర్ చాలా బాగుండేది. ఆమె నా ఫస్ట్ క్రష్ అంటూ వివరించాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. డార్లింగ్ మహా ముదిరే అంత చిన్న ఏజ్ లోనే టీచర్‌కు లైన్ వేసాడా అంటూ.. ఈయన మహా చిలిపి కుర్రాడే అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌.