అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడుగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మన్మధుడు, టాలీవుడ్ కింగ్ ఇలా అభిమానులనుంచి ఎన్నో బిరుదులు సంపాదించుకున్న నాగ్ ఆడియన్స్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక 7 పదుల వయసులోను అదే ఫిట్నెస్ మైంటైన్ చేస్తూ.. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. దాదాపు 80 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన నాగ్ తన నటనకు ఎనో ప్రసంశలు అందుకున్నాడు. నటుడిగానే కాదు నిర్మాతగాను మొత్తం తొమ్మిది నంది పురస్కారాలను దక్కించుకున్న ఈయన.. రెండు నేషనల్ సిల్వర్ స్క్రీన్ అవార్డ్స్ ను దక్కించుకున్నాడు.
మూడు సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అన్నమయ్య, షిరిడి సాయి, శ్రీరామదాసు, హితేరం భావాజీ లాంటి ఎన్నో పౌరాణిక చిత్రాల్లో దేవుడు పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పటికీ ఆయన నటించిన భక్తి సినిమాలు టీవీలో వస్తున్నాయంటే.. ప్రేక్షకులంతా స్క్రీన్‌లకు అతుక్కుపోయి మరీ చూస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో నాగార్జున గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో మంది హీరోయిన్లతో రొమాన్స్ నాగ్ యూత్‌లో మన్మధుడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి నాగార్జున ఓ హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి మాత్రం తెగ భయపడిపోయాడట.
ఇంతకీ నాగ్‌ను అంతగా భయపెట్టిన హీరోయిన్ ఎవరు.. కారణం ఏంటో.. ఒకసారి చూద్దాం. ఆమె మరెవరో కాదు దివంగత అతిలోకసుందరి శ్రీదేవి. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాగార్జున హీరోగా తెరకెక్కిన క్షణక్షణం, గోవింద గోవిందా సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అయితే నాగార్జున కంటే ముందుతరం హీరోలతో కూడా ఈమె రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాగార్జున.. శ్రీదేవితో రొమాంటిక్ సీన్స్ అంటే కాస్త ఎక్సైట్మెంట్‌తో పాటు.. టెన్షన్ కూడా ఫీలయ్యేవాడట. ఎంత లేదన్న రొమాంటిక్ సీన్స్ షూట్ టైంలో తెలియకుండానే నాగార్జునకు ఒణుకు వచ్చేసేదట. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ సందర్భంలో వివరించాడు.