బిగ్‌బాస్ షో పై వేణుస్వామి సెన్సేషనల్ కామెంట్స్.. ఇంత మాట అనేశాడేంటి..?

సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రియాలిటీషో బిగ్‌బాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ షో తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకుంది. చివరి సీజన్లో రైతుబిడ్డ అంటూ కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్న‌ర్ ట్రోఫి అందుకున్నాడు. ఇక ఈ బిగ్ బాస్ షోను ఆసక్తిగా చూసే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారో.. నెగెటివిటీతో కామెంట్లు, ట్రోల్స్ చేసే జనం కూడా అంతే మంది ఉన్నారు.

ఇప్పటికే ఈ షోపై ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే త్వరలోనే తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇందులో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడని.. చాలా భారీ రెమ్యునరేషన్ తీసుకొనున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా దానిపై స్పందించిన ఆయన షోపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాంట్రవర్సీ కామెంట్స్ తో రెచ్చిపోయాడు. బిగ్‌బాస్‌కా.. నేనా.. అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.

అదొక చెత్త షో.. ఈ షో విన్న‌ర్‌గా నిలిచిన ఏడాది పాటు కన్ను నిన్ను కానకుండా ప్రవర్తిస్తారు. సంవత్సరం పూర్తయ్యేసరికి మరో సీజన్ ప్రారంభమవుతుంది. అప్పుడు ముందు సీజన్లో విన్నర్ గా నిలిచిన వాళ్ళు బిస్కెట్ అవుతారు. దానివల్ల ఎలాంటి అంత ప్రయోజనం కూడా ఉండదు. నాకు ఇప్పటికే బిగ్‌బాస్‌కు రమ్మని రెండుసార్లు ఆఫర్లు వచ్చాయి. కానీ.. నేను ఎప్పుడూ ఆ హౌస్ లో అడుగు పెట్టను. బిగ్‌బాస్‌కి నేను పూర్తి వ్యతిరేకం. అక్కడికెళ్లి నేనేం చేస్తాను. బిగ్‌బాస్‌కి వెళ్లి లైఫ్ పాడు చేసుకోవద్దని నేనే అందరికీ నేనే చెప్తా. అలాంటిది నేనెందుకు వెళతా అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి.