సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో నాన్న అని పిలిచిన న‌టుడు ఎవ‌రంటే..?

నందమూరి నటసార్వభౌముడు తారక రామారావు గారికి టాలీవుడ్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లది మంది హృదయాల్లో ఆరాధ్య దైవంగా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. తెలుగు తెరపై నటుడుగానే కాదు.. రైటర్ గా, దర్శకుడుగా, నిర్మాతగా మల్టిపుల్ టాస్క్‌ల‌ను ప్లే చేసి సక్సెస్ అందుకున్నారు. న‌టుడిగాను ఈయన జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రక జోన‌ర్‌ల‌ని వ్య‌త్యాశం లేకుండా ప్రతి జానర్‌లోను తిరుగులేని ముద్ర వేసుకున్నారు.

సినిమా పరిశ్రమ అంతకంతకు ఎదగడానికి ఎన్టీఆర్ మెయిన్ పిల్లర్‌గా నిలిచారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ తను హ్యాపీగా ఉండడమే కాకుండా.. చుట్టుపక్కల వారిని కూడా నవ్వుతూ పలకరిస్తూ.. ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. అలా తన తొలితరం హీరోయిన్ అయిన పుండరీకా బాయ్‌ని ఎన్టీఆర్ గారు అమ్మ అని పిలిచేవారు. తన తల్లిని కాకుండా కేవలం ఆమెను మాత్రమే అన్నగారు అమ్మ అని పిలిచేవారట. అలాగే ఇండస్ట్రీలో మొదటి తరం హీరోగా మంచి సక్సెస్ అందుకున్న చిత్తూరు నాగయ్యను ఎన్టీఆర్ గురువుగా భావించే వారట.

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే నాగయ్య పై ఎన్టీఆర్ కి ఎంతో గౌరవం ఉండేదట. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత ఆయనతో కాస్త పరిచయం ఏర్పడిన తర్వాత.. నాగయ్యను ఎన్టీఆర్ నాన్న అని పిలిచేవారట. ఇక ఎన్టీఆర్ ఖ్యాతి ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. మొదట్లో దేశవ్యాప్తంగా ఆయన సతిజయంతి వేడుకలు జరిగేవి.. ఇప్పుడైతే ఏకంగా ప్ర‌పంచ వ్యాప్తంగా తార‌క రాముడి శ‌త జ‌యంతి వేడుక‌లను పుర‌స్క‌రించుకుంటున్నారు జ‌నం.