తారక్ రిజెక్ట్ చేసిన కథలతో స్టార్లు అయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడుగా.. మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ఈయన.. తాతకు తగ్గ మనవడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న తారక్.. తన కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో కథలను రిజెక్ట్ చేశాడు. ఇక కథను విన్న జడ్జిమెంట్ సరిగ్గా చేయలేని సందిగ్ధతతో కథలను వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అలా తారక్ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలను మరో హీరో నటించి స్టార్ హీరోగా సక్సెస్ను అందుకున్నారు. ఇంతకీ అలా తారక్ రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు ఏంటో.. వాటిల్లో నటించి సక్సెస్ అయిన హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

దిల్ :వి.వి. వినాయక డైరెక్షన్‌లో దిల్ సినిమా తెర‌కెక్కి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసింది. ఇక ఈ సినిమా స్టోరీని వినాయ‌క్‌ మొదట ఎన్టీఆర్ కు వినిపించారట. తార‌క్ ఆ స్టోరి తనకు సెట్ కాదని సున్నితంగా సినిమాను రిజెక్ట్ చేశాడట. తర్వాత ఈ సినిమాకు నితిన్ హీరోగా న‌టించి ఈ సినిమా స‌క్స‌స్ కావ‌డంతో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఆర్య :
ప్రస్తుతం పాన్ స్టార్ట్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న సుకుమార్ దర్శకత్వంలో బ‌న్నీ హీరోగా నటించిన సినిమా ఆర్య. అయితే ఆర్య సినిమా మొదట ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిందట. కానీ.. ఎన్టీఆర్ కథ మరీ సాఫ్ట్‌గా ఉందనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ సినిమాను అల్లు అర్జున్ నటించిన సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ స్టార్ హీరోగా మంచి ఇమేజె సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ కూడా పాన్ ఇండియ‌న్‌ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

భద్ర :
బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా మొదట ఎన్టీఆర్ నటించాల్సిందట. కానీ ఏవో కారణాలతో దీనిని తారక్ రిజ‌క్ట్‌ చేయడం.. ఈ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ సినిమా సెట్స్‌ పైకి వచ్చింది. రవితేజ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా స‌క్స‌స్ తర్వాత స్టార్ హీరోగా మారిన రవితేజకు కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.