ఓర్నీ.. వెంకటేష్ హీరోయిన్ ఆ టాలీవుడ్ విలన్‌ను ప్రేమ‌ పెళ్లి చేసుకుందా.. !

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ అమ్మడు.. అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. తన క్యూట్ నెస్ తో యూత్ ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ప్రేమించుకుందాం రా.. సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ‌జ‌లా తర్వాత ఎన్నో టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి ఇలా అంద‌రు సీనియ‌ర్‌ స్టార్ హీరోల స‌ర‌స‌న నటించిన మెప్పించింది. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా, దేవి పుత్రుడు సినిమాల్లో నటించి రెండు సినిమాలతోనూ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది.

Happy Birthday Anjala Zaveri: Top 5 Impressive Performances of the Actress

ఇక‌ బాలయ్య తోను నరసింహనాయుడు, భలేవాడివి బాసు రెండు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక చిరంజీవితో చూడాలని ఉంది, నాగార్జునతో చందమామ రావే సినిమాల్లో ఆక‌ట్ఉకుంది. తెలుగు తో పాటు హిందీలోను పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. కొంత గ్యాప్ తర్వాత ప్రేమ సందడి, ఆప్తుడు సినిమాల్లో మెరిసింది. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలోని గెస్ట్ రోల్‌లో నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన అంజ‌లా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది.. తెలుసుకోవాలని ఆసక్తి కచ్చితంగా అభిమానుల్లో ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఇప్పటికీ త‌న అందం చెక్కుచెదరకుండా.. అంతే యూత్ ఫుల్‌గా మెయిన్ టేయిన్ చేస్తుంది.

అంజలా జవేరి భర్త పెద్ద విలన్.. పిల్లలను కూడా వద్దనుకుని.. చివరికి ఇలా? –  News18 తెలుగు

ఇక సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మందికి పరిచయం అన్న అంజలా జవేరి.. భర్త గురించి మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. అతను నటుడే కావడం విశేషం. జవేరి భర్త పేరు తరుణ్ అరోరా. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన తరుణ్ అరోరా.. విలన్ పాత్రల్లో ప్రేక్షకులను భయపెట్టాడు. ఖైదీ నెంబర్ 150 లో విలన్ గా కనిపించిన ఈయన.. జయ జానకి నాయక, కాటంరాయుడు, అమర్ అక్బర్ ఆంటోనీ, అర్జున్ సురవరం లాంటి ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. తెలుగుతో పాటు హిందీలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ స్టైలిష్ విలన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇలాంటి క్రమంలో అంజలి జవేరి, తరుణ్ అరోరా వరకు సంబంధించిన ఫొటోస్ వైర‌ల్ అవడంతో.. అంజ‌లా జవేరి ఆ టాలీవుడ్ విలన్‌ను పెళ్లి చేసుకుందా అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళిద్దరి పెయిర్‌ క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.