టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడెప్పుడో త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న దేవర రెండు పార్టులుగా రిలీజ్ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమానే దేవర భారీ బడ్జెట్‌తో వస్తోంది. రెండు పార్టులు అనగానే దేవరపై అంచనాలు స్కై రేంజ్ కు వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది.
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా మరో విలన్ గా నటిస్తున్నట్టు రూమర్ వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు.. బాబీ డియోల్ కూడా విలన్ గా నటిస్తాడు అని టాక్ ? దేవర 1లో బాబి డియోల్ రోల్ సెకండాఫ్ క్లైమాక్స్ లో ఎంటర్ అయ్యి.. ఇక సెకండ్ పార్ట్‌లో ఫుల్‌గా ఉంటుందట. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు… ఈ సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.