ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్ హీరో, హీరోయిన్ల హిట్ సినిమాలను మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్ చేసి లాభాలు పొందుతున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే పలు సినిమాలు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన ఓ సినిమా రీరిలీజ్ కాబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సమంత వెండితెరపై కనిపించి కూడా చాలా కాలం కావడంతో ఆడియన్స్ అంతా ఎప్పుడెప్పుడు సమంతను బిగ్ స్క్రీన్ పై చూస్తామంటూ తెగ ఆరాటపడిపోతున్నారు.
ఈ క్రమంలో సమంత నుంచి రీరిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులో ఆశక్తి నెలకొంది. ఇంతకీ మూవీ ఏంటో చెప్పలేదు కదా.. అదే గౌతమ్ మీనన్ డైరెక్షన్లో సమంత నటించిన ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ సినిమాల్లో శ్యామ్.. నేచురల్ స్టార్ నానికి జంటగా నటించిన మెప్పించింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ క్రమంలో 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. ఆగస్ట్ 29కి ఈ సినిమాను లక్ష్మీనరసింహ మూవీస్ బ్యానర్ పై సుప్రియ, శ్రీనివాస్ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వంతో పాటు ఇళయరాజా సంగీతం కూడా హైలెట్గా నిలిచాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాయి.