ఈ మూడు పౌరాణిక పాత్రలను పోషించే సత్తా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి. వారు మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేయగలుగుతారని అభిప్రాయాలు ఎంతోమంది వ్యక్తపరుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ ఆ పాత్రలో నటించిన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేరు. వారిని ఆ పాత్రల్లో చూసి ఆక్సెప్ట్ చేయడం కూడా ఆడియన్స్ కు కష్టతరమవుతుంది. అలా ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో కొన్ని పౌరాణిక పాత్రలు కొంతమంది స్టార్ హీరోలకు మాత్రమే సెట్ అవుతాయని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోస్ ఎవరు.. వారికి సెట్ అయ్యా పాత్రలు అంటే ఒకసారి తెలుసుకుందాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు లాంటి పాత్రలను పోషించాలంటే అది ప్ర‌స్తుతం ఉన్న హీరోల‌లో కేవలం కొంతమంది హీరోట‌ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.

వారు మాత్రమే ఆ పాత్రలకు న్యాయం చేయగలుగుతారు. అలా కృష్ణుడు పాత్రను పోషించాలంటే టాలీవుడ్‌లో మహేష్ బాబుకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆయన చూడడానికి ఎంతో సాఫ్ట్‌గా కృష్ణుడు మాదిరిగా కనిపిస్తాడు. కనుక ఆయన మాత్రమే వంద శాతం న్యాయం చేయగలరని.. మరెవరు చేసినా ఆ పాత్రకు అంతగా సూట్ కారని సినీ నిపుణుల అభిప్రాయం. ఇక దుర్యోధనుడు పాత్ర చేయాలంటే ఇండస్ట్రీలో కేవలం జూనియర్ ఎన్టీఆర్ వ‌ల్ల‌ మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలను కూడా పోషించి సక్సెస్ అందుకుంటాడు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయిన ఎన్టీఆర్ న‌టిస్తారు. ఇప్పటికే జై లవకుశ, టెంపర్ లాంటి సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

RRR Movie HD Stills Ram Charan Gifs, 46% OFF

కనుక‌ ఇలాంటి పాత్రలు చేయడం కేవలం తారక్‌ వల్లే సాధ్యం. ఇక అర్జునుని పాత్ర చేయాలంటే అది రాంచరణ్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని.. ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చ‌ర‌ణ్ బాడీ లాంగ్వేజ్, కటౌట్ అర్జునుడి క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. ఇలా ఈ మూడు పౌరాణిక పాత్రలను పోషించాలంటే కేవలం ఎన్టీఆర్, మహేష్ , చరణ్ వాళ్ళ మాత్రమే అవుతుందని.. మరే హీరోకు అది సాధ్యం కాదని చాలామంది త‌మ‌ అభిప్రాయం కూడా. ఈ ముగ్గురిలో పౌరాణికానికి సంబంధించిన భావాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ హీరోలు పౌరాణిక పాత్రలపట్ల ఎప్పటికప్పుడు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమంది ఆడియన్స్ ఈ ముగ్గురు హీరోలను అలాంటి పాత్రలో చూడాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మ‌రి మన టాలీవుడ్ స్టార్స్ ఈ పాత్ర‌లో నటించే అవకాశాన్ని ఎప్పటికీ అందుకుంటారో వేచి చూడాలి.