ధనుష్ ‘ రాయన్ ‘ వరల్డ్ వైడ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలు ఇవే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లోను ప‌లు సినిమాల‌తో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్ర‌స్త‌తం త‌న 50ం సినిమా రాయన్‌ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిధ్ద‌మవుతు్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమా జులై 26(రేపు) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్ప‌టికే సినిమానుంచి వ‌చ్చిన ట్రైలర్ ప్రేక్ష‌కులో మంచి బజ్ క్రియేట్ చేసుకోగా.. తమిళ్లో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది.

Hero Dhanush and Sundeep Kishan's Rayaan Movie Pre Release Event Highlights  #viralvideo #dhanush - YouTube

తెలుగులోను డీసెంట్ అంచనాలను తెచ్చుకున్న ఈ సినిమా.. టాలీవుడ్ బిజినెస్ లెక్కల ప్రకారం రూ.5 కోట్ల రెంజ్‌లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందట‌. ఈ క్రమంలో రాయన్ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 1.50 కోట్ల రేంజ్‌లో షేర్‌ వసూళ్ళు చేయాల్సి ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ధనుష్ నటించిన చివరి సినిమా కెప్టెన్ మిల్లర్ రూ.44 కోట్ల రేంజ్‌లో బిజినెస్‌ను జరుపుకుంది. ఇప్పుడు రాయన్ మూవీ కూడా దాదాపు అదే రేంజ్ లో బిజినెస్లను జరుపుకుంది. అలా రాయన‌ట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న‌ బిజినెస్ లెక్కలను ఒకసారి తెలుసుకుందాం.

Dhanush's Raayan audio launch to take place on this date?

తమిళనాడులో రూ. 2.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5కోట్లు, కర్ణాటకలో రూ.3 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 7.5కోట్లు బిజినెస్ ను జరుపుకుంది. ఇక‌ ఆర్ఓఐ తో రూ.1.5 కోట్ల బిజినెస్ జరుపుకుంద‌ని టాక్‌. ఇలా మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్లను పూర్తి చేసుకున్న రాయన్‌.. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.46 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను కొల్లగొట్టాల్సి ఉంది. 85 నుంచి 90 కోట్లు కలెక్షన్లు వసూళ్ళు చేస్తే.. ఇక ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక ధనుష్ 50వ‌ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఈ హీరోకి ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.