ఒకే ఒక్క మాటతో బన్నీకి రాడ్ దించేసిన నాగబాబు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఎక్కడో మండించాడుగా..!

అసలే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు . అలాంటి వాళ్లకు మండిపోయేలా మరొక ట్వీట్ చేశాడు నాగబాబు . దీంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది. మనకు తెలిసిందే.. రీసెంట్ గానే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ అంతా కూడా సపోర్టుగా నిలిచింది . సురేఖ – రామ్ చరణ్ కూడా పిఠాపురం చేరుకొని పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశారు .

అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ అందరి హీరోస్ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు . అల్లు అర్జున్ కూడా ఒక ట్వీట్ చేశాడు . అయితే వైసిపి క్యాండిడేట్ శిల్పా రవికి ఇచ్చిన మాట ప్రకారం బన్నీ ఏకంగా నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు . దీంతో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ అంటూ ఎక్కువ ప్రచారం జరిగింది. కాగా ఈ విషయంపై ఎన్నో రకాల కౌంటర్స్ రీకౌంటర్స్ కూడా మనం విన్నాం. తాజాగా ఈ గొడవలను మరోసారి గుర్తు చేస్తూ నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులకు మండిపోయేలా చేసింది ..మరింత రెచ్చగొడుతుంది అంటూ జనాలు కామెంట్స్ పెడుతున్నారు .

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. “మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మా వాడైనా పరాయి వాడైనా మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే అంటూ పరోక్షకంగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ పేరు ఎత్తకుండా అసలు విషయాన్నీ ఘాటుగా చెప్పేశాడు”. ఇదంతా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలవగా అల్లు అర్జున్ మాత్రం వైసిపి వాళ్లకు ప్రచారం చేయడం కారణంగానే ట్విట్ చేశాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . మరికొందరు అల్లు అర్జున్ కి రాడ్ దించేశాడు నాగబాబు అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తుంటే బన్నీ ఫాన్స్ కూడా అదే రేంజ్ లో మెగా ఫాన్స్ కి కౌంటర్స్ వేస్తున్నారు..!!