డిప్రెషన్ లో ఉపాసన.. చరణ్ చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉపాసనకు సినీ ఇండస్ట్రీతో ఎటువంటి టచ్ లేకపోయినా.. ఆ మె చేసే సామాజిక కార్య‌క్ర‌మాల‌తో మెగా అభిమానుల్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈ జంట ఎప్పటికప్పుడు అన్యోన్యంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చరణ్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీ కంటూ ప్రత్యేకమైన టైంను కేటాయిస్తూనే ఉంటాడు.

ఉపాసనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాగా పెళ్లైన పది సంవత్సరాలకు వీరికి క్లింకార పుట్టిన సంగతి తెలిసిందే. క్లింకార పుట్టడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం అవధులు దాటింది. ఇక వీరిద్దరూ క్లీంకార‌తో క‌లిసి ప్రతి ఫంక్షన్కు అటెండ్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాగా తాజాగా చేరణ్, ఉపాసనలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టెంట వైరల్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన మాట్లాడుతూ.. చరణ్ గురించి ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అందులో భాగంగా నా భర్త నా థెరపిస్ట్.. చాలామంది లాగే నేను కూడా డెలివరీ తర్వాత బాగా ఒత్తిడికి గురయ్యా. అంటూ వివ‌రించింది.

డిప్రెషన్ లోకి వెళ్లి పోయా.. అప్పుడు నాకు అండగా.. చరణ్ తోడుగా ఉన్నాడు. నాకోసం చరణ్ నా పుట్టింటికి వచ్చేసాడు.. ఇలాంటి భర్త అసలు ఎవరికీ ఉండరేమో.. చరణ్ లాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం. భార్య.. తల్లిగా మారే టైంలో భర్త సపోర్ట్ కచ్చితంగా ఉండాలి. ఇక చరణ్ నాపై తీసుకున్న శ్రద్ధ.. నా గురించి ఆలోచించే విధానం.. నాకు ఇప్పటికీ చాలా నచ్చుతుంది. చరణ్ నా భర్తగా దొరకడం నా అదృష్టం అంటూ వివరించింది ఉపాసన. ప్రస్తుతం ఉపాసన చరణ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. చరణ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు.