రానాను కారు ఎక్కించుకుని ఆ విషయంలో నాలుగు గంటలు క్లాస్ పీకిన సూర్య.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడిగా, విక్టరీ వెంకటేష్ అన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రానా. సిని బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ.. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు రానా టాలీవుడ్ లో నటించిన ప్రతి సినిమాతో వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించాడు. రానా నుంచి సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో మొదలైంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన రానా.. ఓ ఇవెంట్‌లో కోలీవుడ్ హీరో సూర్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రానా, సూర్య మొదటి నుంచి మంచి స్నేహితులను సంగతి చాలా మందికి తెలియదు.

Rana Daggubati - With Surya at the SIIMA_Anjjan press conf. in KL. |  Facebook

వీరిద్దరి స్నేహం దాదాపు 15 ఏళ్ల నుంచి కొనసాగుతుందట. అయితే గతంలో సూర్య నటించిన ఈజీ మూవీ ఫ్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో రానా పాల్గొని సందడి చేశాడు. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ హైదరాబాదులో గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. ఈ ఇవెంట్‌లో రానా.. సూర్య గురించి మాట్లాడుతూ మొదట్లో ఈయన ఎవరో కూడా తెలియదని.. ఇప్పుడు నాకు ఇండస్ట్రీలోనే క్లోజ్ ఫ్రెండ్ అంటూ వివరించాడు. ఇక ఓ 12 ఏళ్ల క్రితం సూర్య, రానా నటించిన ఓ సినిమాను.. ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని చూశాడట. దాంతో రానాను పిలిచి కారులో ఎక్కించుకొని మరి మూడు, నాలుగు గంటలు హైదరాబాద్ చుట్టూ తిప్పుతూ రానాకి పిచ్చపిచ్చగా క్లాస్ పీకేసాడట.

Rana Making hilarious fun With Surya @ Suriya ET Movie Pre Release Event |  Mana Stars

అరే నువ్వు చేసేది యాక్టింగా.. కాదు దేన్నో చంపేస్తున్నావు అంటూ క్లాస్ పీకాడట. ఆరోజు సూర్య అలా క్లాస్ పీకడం వల్లే తర్వాత నా నుంచి ఓ.. బల్లాలదేవ, డానియల్ శేఖర్ లాంటి పాత్రలు పుట్టాయంటూ వివరించాడు రానా. ఈ విషయాన్ని చెప్తుండగా సూర్య.. రానా దగ్గరికి వచ్చి హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నెట్టింట వైరల్ అవ్వడంతో వీరిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం సూర్య కంగువా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయ అర్థంలో రిలీజ్ కానుంది. ఇక రానా.. రజినీకాంత్ వెట్టయాన్ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.