ప్రభాస్ ఫ్యాన్స్ కు పండ‌గ చేసుకున్నే న్యూస్.. ‘ కల్కి ‘ మూవీ రిలీజ్ డేట్ లాక్..!!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత దాదాపు వచ్చిన సినిమాలేవి అనుకున్న టైం కి రిలీజ్ కాలేదు. అన్ని సినిమాలు ముందుగా ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి.. తర్వాత వేరే డేట్స్ లో విడుదల చేయడమే ఎక్కువగా జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం కల్కి 2898 ఏడి విషయంలోను ఇదే జరుగుతుంది. ఈ సినిమా అనుకున్న దానికంటే అంతకంత‌కు ఇంకా ఆలస్యం పెరుగుతూ షూటింగ్ నిదానంగా జరుగుతుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల మంచి అంచనాలు ఉన్నాయి. దాదాపు 3 ఏళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది.

రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రభాస్‌, అమితబ్‌ బచ్చన్, కమలహాసన్, దీపికా లాంటి స్టార్ క్యాస్ట్‌తో ఈ సినిమా రూపొందించబడుతుంది. ఇందులో ప్రభాస్ కాలభైరవ రోల్‌లో కనిపించాడు. అమితాబచ్చన్ అశ్వద్ధామగా నటిస్తున్నాడు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదట కల్కి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నప్పటికీ.. అది వర్కౌట్ కాలేదు. దీంతో మే 9న‌ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఈ సినిమా మరోసారి పోస్ట్ పొన్‌ అయింది. ఈ నెల మే 9న సినిమాను విడుదల చేయాలనుకున్న టీం దీంతో వెనకడుగు వేశారు.

ఆంధ్ర తెలంగాణ కూడా మే 13న పోలింగ్ డేట్ ఉండడంతో లోక్‌శ‌భ ఎన్నికలు ఏపీ లోక్‌శ‌భతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేరోజు జరగనున్నాయి. ఈ క్రమంలో సినిమాలు పోస్ట్ పనిచేసిన మేకర్స్ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక డైరెక్టర్ నాగ అశ్విన్ ఓవైపు సినిమా షూటింగ్ పూర్తిచేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా దృష్టి సారించారట. ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ పై మంచి సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా భారతీయ సినీ ఇండస్ట్రీలో మరో మైలురాయిగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.