చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన బన్నీ.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!

మెగా హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వీరు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోలుగా భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలతో వీరిద్దరూ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ చేయాల్సిన ఓ సినిమాతో బన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే చాలా ప్రత్యేకంగా నిలిచిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Ram Charan To Join Allu Arjun

బన్నీ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే ఇది జరిగింది. గంగోత్రి మూవీలో అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాకి రామ్ చరణ్ చేయాల్సి ఉందట. అయితే అనుకోకుండా బన్నీకి ఈ అవకాశం దక్కింది. అసలు మ్యాటర్ ఏంటంటే గంగోత్రి కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మొదట చరణ్ ను సంప్రదించారట మూవీ యూనిట్. అయితే చరణ్ యాక్టింగ్ అప్పటికి నేర్చుకొని ఉండకపోవడంతో ఇంకా సమయం పడుతుందని తనకు ఇంకా శిక్షణ కావాల్సి ఉందని చిరు సినిమాను రిజెక్ట్ చేస్తారట. ఈ మూవీ కోసం బన్నీ అయితే బాగుంటాడని తనతో చేయాలని చిరంజీవి కోరడంతో చరణ్ కాకుండా బన్నీని పెట్టి సినిమాను తీశారట మేకర్స్.

Gangotri

అలా గంగోత్రితో.. చరణ్ కంటే ముందే హీరోగా ఇంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీలో బన్నీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఎంతో మంది ప్రశంసలు అందుకున్నాడు. 2003లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినా ఈ సినిమా మ్యూజిక్ కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత చరణ్ నటుడిగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ సెంటిమెంట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. ఇందులో నేహా శర్మ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. తర్వాత మగధీరతో భారీ సక్సెస్ అందుకున్నాడు చరణ్. ఇక‌ ప్రస్తుతం గేమ్ చేంజర్‌ సినిమా షూట్లో చ‌ర‌ణ్‌, పుష్ప 2 సినిమా షూట్లో బ‌న్నీ బిజీగా గడుపుతున్నారు.