అమ్మ బాబోయ్..ప్రభాస్ ని ఇంత మంది అమ్మాయిలు బాధపెట్టారా..? ఎందుకంటే..?

జనరల్ గా చాలామంది అనుకుంటూ ఉంటారు ..స్టార్ హీరోస్ ప్రపోజ్ చేస్తే ఎవరు రిజెక్ట్ చేయరు అని …వాళ్ళ డబ్బు.. వాళ్ళ ఆస్తి.. వాళ్ళ పలుకుబడి చూసి అమ్మాయిలు ఇట్టే పడిపోతూ ఉంటారు అని ..అలాంటి వాళ్ళు ప్రపోజ్ చేయడమే పెద్ద మహా ప్రసాదంగా భావిస్తూ ఉంటారు అని .. చాలా చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు . కానీ అది తప్పు అంటూ లేటెస్ట్గా ప్రభాస్ కి సంబంధించిన వార్త వైరల్ అవుతూ ఉంటే తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్ళి పోతున్నాడు.

ఆయన ఎలాంటి సినిమాలో నటిస్తున్నాడో మనకు తెలిసిందే . అన్నీ కూడా ఇండస్ట్రీని తిరగరాసే చరిత్రగలిగే సినిమాలే కావడం గమనార్హం. కాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్త ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన అమ్మాయిలకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. మన ప్రభాస్ కూడా లవ్ ఫెయిల్యూర్ అట . ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ చదువుకునే రోజుల్లోనే లవ్ ఫెయిల్యూర్ సిచువేషన్ ఫేస్ చేశారట. ఆయన చదువుకునే టైంలోనే స్కూల్లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించారట . అయితే అది లవ్ లేదా..? అట్రాక్షన్ తెలియని ఏజ్ కావడంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు అంట.

మరి ముఖ్యంగా ఆ అమ్మాయి అసలు ప్రభాస్ ని పట్టించుకోనేలేదట . ఆ తర్వాత ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రభాస్ మరొక అమ్మాయిని ప్రేమించారట. ఆ అమ్మాయి వాడుకున్నన్ని రోజులు వాడుకొని ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట . ఫైనల్లీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ని కూడా ప్రేమించాడట . ఆ ముద్దుగుమ్మ ప్రభాస్ క్రేజ్ ని వాడుకొని ప్రభాస్ తో పాటు మరొక హీరోని కూడా వలలో వేసుకుంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ప్రభాస్ ఆ హీరోయిన్ ని దూరం పెట్టేసారట . ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అమ్మాయిలు ప్రభాస్ మనసును బాధపెట్టారు. ఆ కారణం చేతనే ప్రభాస్ పెళ్లికి దూరంగా ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు . కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం బాగా ఫీల్ అయిపోతున్నారు..!!