రాను రాను ఆ కలిసి వచ్చిన సెంటిమెంట్ ని పక్కన పెట్టేస్తున్న పాన్ ఇండియా హీరోలు..భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు ..మేకర్స్ కొన్ని కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు . మరి ముఖ్యంగా శుక్రవారం నాడు సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం ఇండస్ట్రీలో 80% జనాలకు ఎప్పటినుంచో ఉంది . పెద్దపెద్ద స్టార్స్ బడాబడా హీరోలు కూడా అదే డెసిషన్ ని అదే సెంటిమెంట్ని ఫాలో అవుతూ ఉంటారు . అయితే ఈ మధ్యకాలంలో మెల్లమెల్లగా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసేస్తున్నారు పాన్ ఇండియా హీరోలు.

కారణాలు ఏవైనా కావచ్చు హిట్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తే వచ్చే లాస్ ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు సినీ విశ్లేషకులు . ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ తమ సినిమాలను శుక్రవారం కాకుండా ఎక్కువగా గురువారం నాడు రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తన సినిమాలను ఎప్పుడు శుక్రవారం రిలీజ్ చేసే ఎన్టీఆర్ దేవర విషయంలో మాత్రం రూటు మార్చేశాడు. అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

దసరా కానుకగా గురువారం నాడు..ఈ సినిమాను థియేటర్స్లోకి తీసుకురావడానికి చూస్తున్నాడు ఎన్టీఆర్ . అదే విధంగా కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా కూడా జూన్ 13వ తేదీ గురువారం నాడు రిలీజ్ కాబోతుంది. అంతేనా ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కల్కి సినిమా కూడా జూన్ 27న గురువారం నాడే థియేటర్స్లోకి రాబోతుందట . ఇక ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్న పుష్ప2 సినిమా కూడా ఆగస్టు 15వ తేదీ గురువారం నాడే థియేటర్స్లోకి రిలీజ్ కాబోతుంది. ఈ మధ్యకాలంలో స్టార్స్ శుక్రవారం సెంటిమెంట్ ని పక్కనపెట్టి గురువారం సెంటిమెంట్ ని తెరపైకి తీసుకొస్తున్నారు . దీంతో సినీ విశ్లేషకులు పరోక్షకంగా హెచ్చరిస్తున్నారు..!!